Lecturers Reqruitment: కాంట్రాక్టు లెక్చరర్లకు పోస్టింగ్‌లు
సాక్షి, హైదరాబాద్: జోనల్ విధానం అమలు వల్ల విధులకు దూరమైన కాంట్రాక్టు లెక్చరర్స్ çపట్ల ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. వివిధ ప్రాంతాలకు చెందిన 32 మంది కాంట్రాక్టు లెక్చరర్ల తమ విధులు నిర్వర్తించేందుకు వీలుగా కాలేజీలను కేటాయిస్తూ గురువారం ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. మిగిలిన వారికి శుక్రవారం ఇచ్చే వీలుంది. 317 జీవోలో భాగంగా 90 మంది శాశ్వత అధ్యాపకులను మల్టీ జోనల్ వారీగా మార్పు చేసింది. దీంతో వారు కేటాయించిన జిల్లాల్లోని కాలేజీల్లో చేరారు. ఫలితంగా అక్కడ అప్పటివరకు పనిచేస్తున్న దాదాపు 45 మంది కాంట్రాక్టు లెక్చరర్ల విధులకు దూరమవ్వాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో వారు ఇంటర్ బోర్డ్‌ను ఆశ్రయించారు. అంతిమంగా న్యాయం జరగడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. సానుకూలంగా స్పందించిన ఇంటర్ బోర్డ్ కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్‌కు రాష్ట్ర గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు జంగయ్య, మాచర్ల రామకృష్ణగౌడ్, ఏఎస్‌ఎస్‌ఎన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీనివాస్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.