Skip to main content

విదేశీ వైద్య విద్యార్థులకు వెసులుబాటు

సాక్షి, హైదరాబాద్‌: గతంలో భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) అనుమతి పొందిన, 2022 అక్టోబరు 21వ తేదీ లోపు జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) గుర్తించిన విదేశాల్లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన విద్యార్థులు.. ఆయా దేశాల్లోనే ఏడాది పాటు ఇంటర్న్‌షిప్‌ చేస్తే దాన్ని ఈ ఒక్క ఏడాది వరకు గుర్తిస్తామని ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది.
Concession for foreign medical students
విదేశీ వైద్య విద్యార్థులకు వెసులుబాటు

ప్రస్తుతం ఏ దేశంలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసినా కూడా భారత్‌లో అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, అనంతరం ఒక ఏడాది పాటు తప్పనిసరిగా ఇంటర్న్‌షిప్‌ చేయాల్సి ఉంది. ఈ నిబంధన తాజాగా అమల్లోకి రావడంతో 2022 అక్టోబర్‌కు ముందే ఇంటర్న్‌షిప్‌ విదేశాల్లో పూర్తి చేసిన వారు మళ్లీ ఇక్కడ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో అలాంటి అభ్యర్థులు ఈ నిబంధనను సడలించాలని ఎన్‌ఎంసీని కోరారు.

చదవండి: 147 Jobs: మెడికల్‌ కాలేజీల్లో ప్రొఫెసర్‌ పోస్టులు

దీన్ని పరిశీలించిన ఎన్‌ఎంసీ తాజాగా వెసులు బాటు కల్పించింది. తాము అనుమతించిన కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో 2022 అక్టోబర్‌ 21కు ముందు ఎంబీబీఎస్, తత్సమాన అర్హతతో వైద్య విద్య పూర్తి చేసి, ఏడాది పాటు ఇంటర్న్‌షిప్‌ చేసినట్లయితే వారికి ఈ ఒక్క ఏడాదికి సడలింపిస్తామని ఉత్తర్వులు జారీచేశారు. 

చదవండి: బీఎస్సీ పారా మెడికల్‌.. వైద్యవిద్య అనుబంధ కోర్సులివే..

Published date : 07 Jan 2023 03:53PM

Photo Stories