Pen Drive Book: పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్
Sakshi Education
సాక్షి, అమరావతి: జర్నలిస్ట్ రెహాన రచించిన సమకాలీన రాజకీయ పరిశీలన వ్యాసాల సంకలనం ‘Pen Drive’ పుస్తకాన్ని నవంబర్ 11న తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించారు.
వివిధ పత్రికల్లో, ఆయా సందర్భాల్లో రాసిన వ్యాసాలను పెన్ డ్రైవ్ పేరుతో పుస్తక రూపంలో తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమెను సీఎం అభినందించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు(కమ్యూనికేషన్స్) జీవీడీ కృష్ణమోహన్, సీఎం సీపీఆర్వో పూడి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
చదవండి:
YS Jagan Mohan Reddy: అందుబాటులో అంతర్జాతీయ విద్య
YS Jagan Mohan Reddy: నర్సింగ్ విద్యార్థులకు..జర్మనీలో అవకాశాలు కల్పించండి
Published date : 12 Nov 2022 03:32PM