Skip to main content

Online Text Books: ఆన్‌లైన్‌లో పాఠ్య పుస్తకాలు.. పీడీఎఫ్‌ రూపంలో వెబ్‌సైట్‌లో అందుబాటులోకి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులను గ్లోబల్‌ సిటిజన్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
Text books online

ఇందులో భాగంగా ఇంగ్లీష్‌ మీడియం బోధనను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్స్‌ (ఐఎఫ్‌పీ) వంటి అధునాతన పద్ధతుల్లో విద్యా బోధన చేస్తోంది. రాష్ట్రంలోని పాఠశాల విద్యా­ర్థులకు బడి తెరిచిన మొదటి రోజే వారికి అవసర­మైన పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, బూట్లు వంటివి అన్ని వస్తువులతో కూడిన జగనన్న విద్యా కానుక (జేవీకే) కిట్లను అందిస్తోంది. వచ్చే నెల 12న ప్రారంభమయ్యే నూతన విద్యా సంవత్సరానికి కూడా ఈ కిట్లు సిద్ధమవుతున్నాయి. పాఠ్య పుస్తకాలు మండల స్టాక్‌ పాయింట్లకు చేరుతున్నాయి.

మరోపక్క 1 నుంచి 10 తరగతుల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్‌లోనూ పాఠ్య పుస్తకాలను అందుబాటులోకి తెచ్చింది. తెలుగు–ఇంగ్లిష్‌ మీడియంలో వర్క్‌బుక్స్‌తో కలిపి మొత్తం 391 టైటిళ్లను పీడీఎఫ్‌ రూపంలో పాఠశాల విద్యా శాఖ వెబ్‌సైట్‌లో ఉంచింది. గతేడాది ఆన్‌లైన్‌లో ఉంచిన పుస్తకాలను దాదాపు 18 లక్షల మందికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | ముఖ్యమైన ప్రశ్నలు | గైడెన్స్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | టిఎస్ టెన్త్ క్లాస్

ఈ ఏడాది ఇప్పటికే 1,72,482 పాఠ్యపుస్తకాలు డౌన్‌లోడ్‌ అవడం విశేషం. ఈ విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి విద్యార్థులకు కొత్తగా ఎన్సీఈఆర్టీ సిలబస్‌ అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో కొత్త సిలబస్‌ పుస్తకాలను కూడా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశారు. త్వరలో ఉర్దూ, తమిళం, ఒడియా, కన్నడ వంటి మైనర్‌ మీడియం బైలింగ్యువల్‌ పాఠ్య పుస్తకాలను సైతం వెబ్‌సైట్‌లో ఉంచనున్నారు.

పాఠాలను విద్యార్థులు విశ్లేషణాత్మకంగా అర్ధం చేసుకొని, సామరŠాధ్యలను మెరుగుపరుచుకొనేందుకు ఆన్‌లైన్‌ పీడీఎఫ్‌లోని ప్రతి పాఠానికి ఎస్సీఈఆర్టీ ‘క్యూఆర్‌’ కోడ్‌ను జత చేసింది. ఆ కోడ్‌ను స్మార్ట్‌ ఫోన్‌తో స్కాన్‌ చేస్తే పుస్తకంలోని పాఠాన్ని ‘దీక్ష’ పోర్టల్‌లో వీడియో రూపంలో చూసే అవకాశం కూడా కల్పించారు.  పీడీఎఫ్‌ పాఠ్య పుస్తకాలను https:// cse. ap. gov. in వెబ్‌సైట్‌ ద్వారా ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

Published date : 28 May 2024 04:14PM

Photo Stories