Skip to main content

DSC Posts: ఈ ఏడాది డీఎస్సీ పోస్టుల భర్తీ లేనట్లే!?

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డీఎస్సీ అభ్యర్థుల భవిష్యత్తుతో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్ర భుత్వం ఆడుకుంటోంది.
no filling of AP DSC posts this year

ఈ ఏడాది డిసెంబర్‌ లోగా 16 వేల టీచర్‌ పోస్టులు భర్తీచేస్తామని గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే చంద్రబాబు ఈ ఫైల్‌పైనే తొలి సంతకం చేసి అభ్యర్థులో ఆశలు కల్పించారు. దీంతో వీలైనంత త్వరగా పోస్టుల భర్తీ జరుగు­తుందని వారంతా ఆశించారు. 

అదంతా హంబక్కేనని.. ప్ర కటించిన గడువులోగా పోస్టుల భర్తీ చేపట్టే యోచనలో ప్రభుత్వం లేదని తెలు­స్తోంది. జూలై 23న‌ అసెంబ్లీలో మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్‌ చేసిన ప్రకటనే చూస్తే ప్రభుత్వం ఉద్దేశం స్పష్టమవు­తోంది. వచ్చే ఏడాది విద్యా సంవ త్సరం ప్రారంభం అయ్యేనాటికి టీచర్‌ పోస్టు లు భర్తీ చేసేలా ప్రణా­ళికలున్నాయని ఆయన అసెంబ్లీలో ప్రశ్నోత్త­రాల సందర్భంగా వెల్లడించారు. లోకేశ్‌ ఏమన్నారంటే..

చదవండి: DSC Coaching Applications : డీఎస్సీ ఉచిత‌ శిక్ష‌ణ‌కు ద‌ర‌ఖాస్తుల గ‌డువు పొడ‌గింపు..

‘నాడు–నేడు’పై విచారణ జరుగుతోంది..

జగన్‌ ప్రభుత్వ హయాంలో నాడు–నేడు కింద రెండు దశల్లో 38 వేల పాఠశాలల్లో రూ.15 వేల కోట్ల పనులకు శ్రీకారం చుట్టారని.. అందులో రూ.9,425 కోట్ల పనులు పూర్తయ్యా­య­న్నారు. నాడు–నేడు పను­లపై విచారణ జరుగుతోందని నివేదిక అందాక, తదు­పరి నిర్ణయం తీసుకుంటామన్నారు. 

ప్రైవేట్‌ పాఠశా లలకు దీటుగా ప్రభుత్వ బడులను బలోపేతం చేయడానికి కృషిచేస్తామ న్నారు. పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ ఐటీఐలు, పాలిటెక్నిక్‌ కళాశాలలను దత్తత తీసుకుంటామని ముందుకొస్తున్నారని, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. పొ­న్నూ­రు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మాట్లా­డుతూ.. 2018 గ్రూప్‌–1 రిక్రూట్‌మెంట్‌పై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. నియామక ప్రక్రియలో రూ.300 కోట్లు చేతులు మారాయని ఆరోపించారు. 

చదవండి: DSC 2024: డీఎస్సీపై స్టేకు నిరాకరణ.. పరీక్షల్లో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు

781 కి.మీ.ల యూజీడీ పనులు పూర్తి.. 

గ్రేటర్‌ విశాఖ పరిధిలో 781 కి.మీ యూజీడీ పనులు పూర్తయినట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. విశాఖలో 19 ఎస్టీపీలు ఉన్నాయని, వీటిద్వారా 179 ఎంఎల్‌డీ శుద్ధిచేసిన నీటిని పరిశ్రమలకు సరఫరా చేస్తున్నామన్నారు. అలాగే, అన్ని జిల్లాల్లో ఎస్టీపీల కోసం రూ.300 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.

కేంద్ర నిధులు దుర్వినియోగం కాలేదు..

రాష్ట్రంలో కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు దుర్వినియోగం కాలేదని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు. రాష్ట్రంలో ఎస్సీ సబ్‌ ప్లాన్‌ నిధులు మళ్లింపు జరగలేదని సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఎస్సీల సంక్షేమ కోసం ఐదేళ్లలో రూ.58,249 కోట్లు ఖర్చుచేశారన్నారు. 

Published date : 25 Jul 2024 01:22PM

Photo Stories