Skip to main content

Technical Education: సాంకేతిక విద్యతో ఉజ్వల భవిష్యత్‌

వరంగల్‌ : సాంకేతిక విద్యతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని ఉపాధి శిక్షణ శాఖ ఆర్‌డీడీ బి.సీతారాములు అన్నారు.
Warangal's Employment Training Department encourages technical skills, Technical Education,Opportunities await with technical training in Warangal
సాంకేతిక విద్యతో ఉజ్వల భవిష్యత్‌

 వరంగల్‌ పైడిపల్లిలోని అసైండ్‌ ఐటీఐలో అక్టోబ‌ర్ 17న‌ జరిగిన స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. పారిశ్రామిక విప్లవం 4.0కు అనుకూలంగా నైపుణ్యాలను పెంచుకుంటూ ఉపాధి అవకాశాలను అందుకోవాలన్నారు.

టాంకాం సహకారంతో విదేశాల్లో ఉపాధి అవకాశాలు, స్వదేశంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగాలతోపాటు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న అవకాశాలను వినియోగించు కోవాలని సూచించారు. కార్యక్రమంలో బీజేవైఎఫ్‌ అధ్యక్షుడు సూర్యదేవర కార్తీక్‌, అసైండ్‌ ఐటీఐ సిబ్బంది సుజిత్‌కుమార్‌, అఖిల్‌, బాలస్వామి, శ్రీనివాస్‌, మౌనిక, ప్రశాంత్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

చదవండి:

AICTE: పాఠాలే కాదు.. జీవితపాఠాలూ నేర్పాలి

Campus Placement: క్యాంపస్‌ డ్రైవ్స్‌.. ఆఫర్‌ దక్కేలా!

Published date : 18 Oct 2023 01:41PM

Photo Stories