ఎల్బీ స్టేడియం వేదికగా అతిపెద్ద ప్రోస్ట్ కార్నివాల్
నగర యువత సరికొత్త ఆలోచన లను ప్రపంచానికి చాటింది. విద్యార్థుల భవిష్యత్ ప్రణాళికలపై కృషి చేస్తున్న స్టూమాగ్డ్ ఆధ్వర్యంలో మార్చి 12న నిర్వహించిన అతి పెద్ద యూత్ కార్నివాల్ ప్రోస్ట్ విశేషంగా ఆకట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పది వేల మంది వరకు విద్యార్థులు తరలివచ్చి తమ ప్రతిభను, ఆలోచనా విధానాన్ని ప్రదర్శించారు. వినూత్న పరిశోధనలు, ప్రాజెక్టులను, టెక్నాలజీ సంబంధిత స్టార్టప్స్తో అబ్బురపరిచారు. లైవ్ మ్యూజిక్ కన్సర్ట్, గేమ్స్, ర్యాప్ సాంగ్స్, హిప్టాప్ స్టెప్పులతో అలరించారు.
చదవండి: ప్రపంచంలోనే తెలివైన విద్యార్థి... ఈ ఇండియన్ అమెరికన్
విభిన్నంగా తయారు చేసిన గాడ్జెట్స్, ఫ్యాషన్ వేర్తో ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశారు. విద్యార్థులు సృజనాత్మకతను ప్రదర్శించేలా 'బ్యాటిల్ ఆఫ్ బ్యాండ్స్.. ఫ్యాన్ మీట్స్ విత్ ఇన్ఫ్లుయెన్సర్స్' వంటి కార్యక్రమాలను చేపట్టారు. నవ యువతరాన్ని ఆకట్టుకునే 'విజ్ఞానం వినోదం.. వినూత్నం'లోని అన్ని విభాగాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి యువకులకు అద్భుత వేలాదిగా తరలి వచ్చిన యువత మైన వేడుకలను అందించారు. టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి, టీఎస్ సీహెచ్సీ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, స్టూమార్జ్ వ్యవస్థాప కులు చరణ్ లక్కరాజు తదితరులు పాల్గొని విద్యా ర్థులను ఉత్సాహపరిచారు.
చదవండి: యూత్ పార్లమెంట్‌లో తెలంగాణ విద్యార్థిని
అదరహో.. ఎలక్ట్రిక్ కార్..
కార్నివాల్లో గద్వాల్కు చెందిన టి. బీచుపల్లి స్వయంగా తయారు చేసి ప్రదర్శించిన ఎలక్ట్రిక్ కార్ అందరినీ ఆకర్శించింది. 'డిగ్రీ చదివి ఆటో డ్రైవర్ గా పని చేసిన నేను.. కష్టాల పాలు కావడంతో వినూత్నంగా.. తక్కువ ఖర్చు తోనే ఎలక్ట్రిక్ కార్ను తయారు చేశా'నని బీచుపల్లి తెలిపారు. రూ.1.2 లక్షలతో తయా రయ్యే ఈ కార్ 48 వోల్ట్లతో, 4 బ్యాటరీలతో పని చేస్తుం దన్నారు. తెలంగాణ ఇన్నోవే సెల్ విభాగంలో తనకు గుర్తింపు ఉందని,తన ఆవిష్కరణను అందరికీ చేరువ చేయడా నికి ఇన్వెస్టర్ల కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు.
చదవండి: Vikram-S: అంతరిక్ష రంగంలో తెలుగు తేజం నాగభరత్
లైవ్ పెయింటింగ్..
బీవీఆర్ఎస్ఐటీ విద్యార్థులు ప్రత్యేకంగా నిర్వహించిన లైవ్ పెయింటింగ్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ విద్యార్థులు స్టూడెంట్స్ ట్రైబ్ అంశంపై వినూత్నం గా తమ కళను ప్రదర్శిచారు.
చదవండి: మీరూ కావచ్చు, ఒకరోజు బ్రిటిష్ హైకమిషనర్!
డ్రోన్లతో ఔషధాల పిచికారీ
పావమన్ ఏవియేషన్ తయారు చేసిన డ్రోన్లను ప్రదర్శనలో ఉంచారు. ఈ సాంకేతికతతో వ్యవసాయ రంగంలో ఔషధాలను డ్రోన్లతో పిచికారీ చేయవచ్చని నిర్వాహకులు తెలిపారు. అధునాతనంగా డ్రోన్ వీడియోలు తీయవచ్చన్నారు. తమ సంస్థ ఆధ్వర్యం ఔషధాల లో వీటిని వినియోగించడానికి అవసరమైన లైసెన్స్లను పిచికారీ.. కూడా డీజీసీఏ ద్వారా అందిస్తున్నామన్నారు.
చదవండి: అప్పుడు ఒక్క పూట తిండి దొరకలేదు..ఇప్పుడు నెలకు రూ.5 లక్షలు సంపాదన..ఎలా అంటే..?
ఆకట్టుకున్న రోబోటిక్ ప్రాజెక్టులు
మల్లారెడ్డి కళాశాలకు చెందిన విద్యార్థులు ఎడొడ్వాంజా రూపొం దించిన ఏఆర్, వీఆర్, రోబోటిక్ ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. తమ ప్రాజెక్టులను ల్యాబ్స్ ఆన్ వీల్స్ పేరిట రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో ప్రదర్శించి ఈ సాంకేతికతపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నామన్నారు.
చదవండి: పీఎం యువ మెంటార్‌షిప్‌కు ఏయూ విద్యార్థి
ఉర్రూతలూగించిన నృత్యాలు..
హర్ష బృందం చేసిన ర్యాప్, హిప్టాప్ డ్యాన్స్లు విద్యార్థులను ఉర్రూతలూగించాయి. ఈ ప్రదర్శ నకు విద్యార్థుల నుంచి హార్షధ్వానాలు లభిం చాయి. మస్త్ పేరిట వివిధ కళాశాల విద్యార్థుల సంగీత, నృత్య కార్యక్రమాలూ అలరించాయి.
చదవండి: IT Hubs: రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయశ్రేణి పట్టణాల్లో ఐటీ హబ్‌లు
ప్యాకింగ్ మూవింగ్ సేవలు..
అబ్రోడ్ మూవర్ ప్రాజెక్టులు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు విదేశాలకు ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయంలో ప్రత్యేకంగా ప్యాకింగ్-మూవింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని అబ్రోడ్ మూవర్ వ్యవస్థాపకులు తెలిపారు. యూఎస్, దుబాయ్ తదితర దేశాలకు సేవలు అందిం చడానికి వేదిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు.