ప్రపంచంలోనే తెలివైన విద్యార్థి... ఈ ఇండియన్ అమెరికన్
అమెరికాకు చెందిన జాన్ హాప్‌కిన్స్ సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ నిర్వహించిన పలు రకాల పరీక్షల్లో అగ్రస్థానంలో నిలిచి వరసగా రెండో సంవత్సరం ఈ ఘనత సాధించింది. మొత్తం 76 దేశాల నుంచి 15 వేల మంది విద్యార్థినీ విద్యార్థులు జాన్ హాప్‌కిన్స్ సెంటర్ పరీక్షల్లో పాల్గొంటే నటాషా అత్యంత తెలివైనదానిగా తన ప్రతిభ కనబరిచింది.
చదవండి: Inspirational Story: పది నెలల పాపతో ప్రపంచాన్ని చుట్టేస్తోంది... ఎలాగో మీరు ఓ లుక్కేయండి
న్యూజెర్సీ ఫ్లోరెన్స్ ఎం గాడినీర్ మిడిల్ స్కూల్లో చదువుతున్న నటాషా 2021లో జరిగిన పోటీల్లో కూడా పాల్గొని మొదటి స్థానంలో నిలవడం విశేషం. శాట్, యాక్ట్, స్కూల్, కాలేజీ ఎబిలిటీ టెస్టుల్లో నటాషా అసాధారణ ప్రతిభ కనబరిచినట్టుగా జాన్ హాప్‌కిన్స్ సెంటర్ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్‌లో చెన్నైకి చెందిన నటాషా తల్లిదండ్రులు తమ కుమార్తె తెలివితేటలకి మురిసిపోతున్నారు. నటాషా ఖాళీగా ఉన్న సమయంలో జేఆర్‌ఆర్ టోలి్కన్ నవలలు చదువుతుందని, డూడ్లింగ్ చేస్తుందని తెలిపారు.
చదవండి: Inspirational Story: పదో తరగతికే పెళ్లి... మూడేళ్లకే భర్త మృతి... కట్ చేస్తే ఇప్పుడామె‘ఆదర్శం’