Teachers: ఉపాధ్యాయులను కేటాయించండి
Sakshi Education
కొత్త జిల్లాల ప్రకారం ఉపాధ్యాయులను శాశ్వత ప్రాతిపదికన కేటాయించేందుకు మార్గదర్శకాలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ప్రొగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ టీఎస్ (పీఆర్‌టీయూటీఎస్) కోరింది.
ఈ మేరకు నవంబర్ 15న బీఆర్‌కేఆర్ భవన్ లో తెలంగాణ సీఎస్ సోమేశ్‌కుమార్‌కు యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు వినతి పత్రం సమరి్పంచారు. ఉపాధ్యాయుల బదిలీలు, అంతర్ జిల్లా బదిలీల షెడ్యూల్ విడుదల చేయాలని కోరారు. రెండు మూడు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని, ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఐచి్చకాలు స్వీకరించి నవంబర్ నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి చేస్తామని సీఎస్ హామీ ఇచ్చారన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ కూడా నిర్వహిస్తామని సీఎస్ చెప్పారన్నారు.
చదవండి:
ఫౌండేషన్ స్కూల్ విధానానికి శ్రీకారం
Teachers: ఉపాధ్యాయుల నియామకానికి ఏర్పాట్లు
హాజరు పెంచేందుకు.. క్లాస్ టీచర్లే బాధ్యత తీసుకోవాలని సొసైటీల స్పష్టీకరణ
Published date : 16 Nov 2021 03:11PM