Admissions: వెవీయూలో ప్రవేశాలకు దరఖాస్తులు..చివరి తేదీ ఇదే..
Sakshi Education
కడప ఎడ్యుకేషన్: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్వహించే జాతీయస్థాయి పరిశోధక పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి పీహెచ్‌డీలో ఫుల్‌టైం ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు యోగివేమన విశ్వ విద్యాలయం వీసీ ఆచార్య వైపీ వెంకటసుబ్బయ్య తెలిపారు.
యూజీసీ–నెట్/యూజీసీ–సీ ఎస్‌ఐఆర్/ నెట్– సీఈఈడీలో ఫెలోపిష్/స్కాలర్‌షిప్‌కు అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. దరఖాస్తు స్వీకరణకు గడువు జూన్ 12వ తేదీకి ముగుస్తుందని తెలిపారు.దరఖాస్తు ఫారాలను yvu.edu.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. రిజిస్ట్రేషన్ కోసం జనరల్ విద్యార్థులకు రూ. 2 వేలు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ విద్యార్థులు రూ.1,300 చెల్లించాలని చెప్పారు. వైఎస్సార్ జిల్లా కడపలోని యోగివేమన విశ్వవిద్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. రిజిస్ట్రేషన్ విధానం, ప్రతిభను అనుసరించి ఎంపికలుంటాయని తెలిపారు. వివరాలకు 7989208188, 8317532040 నంబర్లలో సంప్రదించాలని వెంకటసుబ్బయ్య తెలిపారు.
Published date : 26 May 2023 04:01PM