Skip to main content

FCRI: ఎమ్మెస్సీ ఫారెస్ట్రీ ప్రవేశాలకు దరఖాస్తులు.. చివరీ తేదీ ఇదే..

ములుగు (గజ్వేల్‌): సిద్దిపేట జిల్లా ములుగు Forest College and Research Institute (FCRI)లో 2022–23 విద్యా సంవత్సరానికి ఎమ్మెస్సీ ఫారెస్ట్రీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కళాశాల డిప్యూటీ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు నవంబర్‌ 15న తెలిపారు.
FCRI
ఎమ్మెస్సీ ఫారెస్ట్రీ ప్రవేశాలకు దరఖాస్తులు.. చివరీ తేదీ ఇదే..

ఆన్‌లైన్‌లో నవంబర్‌ 25వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తు రుసుమును ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ అభ్యర్థులు రూ.1,000, ఇతరులు రూ.2,000 చెల్లించాలని సూచించారు. రూ.500 ఆలస్య రుసుంతో నవంబర్‌ 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

చదవండి: Nallamala forest: అరుదైన ఔషధిగా ‘అగ్నిశిఖ’(Gloriosa superba)

దరఖాస్తు ఫారాన్ని కళాశాల వెబ్‌సైట్‌ www.fcrits.inలో నింపి అవసరమైన పత్రాలను అప్‌లోడ్‌ చేయాలని ఆయన సూచించారు. వివరాల కోసం www.fcrits.in వెబ్‌సైట్‌ను చూడాలని లేదా హెల్ప్‌లైన్‌ నంబర్‌ 8074350866, 8919477851 లలో సంప్రదించాలని లేదా ఈ మెయిల్‌ fcriadmissions@gmail.com ద్వారా తెలుసుకోవచ్చని స్పష్టం చేశారు.

చదవండి: Tejaswi FRO Success Story : సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి.. అడ‌వి బాట ప‌ట్టా.. ఎందుకంటే..?
ప్రవేశ పద్ధతి: అడ్మిషన్లు ICAR&AIEEA PG–2022 ప్రవేశ పరీక్ష (50 శాతం), బీఎస్సీ (ఆనర్స్‌) ఫారెస్ట్రీ (50 శాతం) వెయిటేజీ అకడమిక్‌ స్కోర్‌ పనితీరుపై ఆధారపడి ఉంటుందని వెంకటేశ్వర్లు తెలిపారు.

చదవండి: Geography Notes for Groups: మృత్తికలు.. సాగుకు మూలాధారం!

Published date : 16 Nov 2022 02:33PM

Photo Stories