Sports: చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
మండల కేంద్రంలోని గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో ఏడో జోనల్‌స్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై వివిధ క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతి ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గిరిజన గురుకుల పాఠశాలల విద్యార్థులు క్రీడల్లో అత్యుత్తమంగా రాణిస్తున్నారన్నారు. కార్యక్రమంలో గురుకులాల ఉమ్మడి జిల్లా ఆర్సీవో గంగాధర్, ఎస్సై నరేశ్, ఎంఈవో ఉదయ్‌రావు, బాలికలు, బాలుర కళాశాలల ప్రిన్సిపాళ్లు లక్ష్మీకాంత్‌రావు, రాజేంద్రప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
చదవండి: Students Education: గిరిబిడ్డలకు సేవాభారతి అండ..
బహుమతులు పొందిన వారిలో..
అండర్–14లో..:
కబడ్డీ: ఇందల్‌వాయి కళాఽశాల (ప్రథమ), చేగుంట కళాశాల (ద్వితీయ)
వాలీబాల్: ఇందల్‌వాయి (ప్రథమ), చేగుంట కళాశాల (ద్వితీయ)
హ్యాండ్‌బాల్: ఆసిఫాబాద్ కళాశాల(ప్రథమ), సిర్పూర్ కళాశాల(ద్వితీయ)
చెస్..: సిర్పూర్ కళాశాల (టి)(ప్రథమ), ఇంద్రవెల్లి కళాశాల(ద్వితీయ)
బాల్‌బ్యాడ్మింటన్..: ఇంద్రవెల్లి కళాశాల (ప్రథమ), సిర్పూర్(టి) కళాశాల(ద్వితీయ)
క్యారమ్..: తిర్యాణి కళాశాల (ప్రథమ), బోథ్ కళాశాల(ద్వితీయ)
అథ్లెటిక్స్ అండర్–14లో..
- 100 మీటర్ల పరుగు ..: నక్షత్ర–ఎల్లారెడ్డి(ప్రథమ), పల్లవి–జైనూర్(ద్వితీయ), హారిక–ఇచ్చోడ(తృతీయ)
- 200 మీటర్ల పరుగు..: నక్షత్ర–ఎల్లారెడ్డి(ప్రథమ), జి.అకాంక్ష–చేగుంట(ద్వితీయ), హారిక–ఇచ్చోడ(ద్వితీయ)
- 400 మీటర్ల పరుగు..: అర్చన–ఎల్లారెడ్డి(ప్రథమ), విఘ్నేశ్వరి–చేగుంట(ద్వితీయ), కౌసల్య –ఆసిఫాబాద్(తృతీయ)
- అండర్–14లో నక్షత–ఎల్లారెడ్డి వ్యక్తిగత చాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకుంది.