Skip to main content

యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

ANGRAU 2022 admission
యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం లోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో 2022–23 విద్యా సంవత్సరానికి యూజీ కోర్సులైన ఫుడ్‌ టెక్నాలజీ, అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్, కమ్యూనిటీ సైన్స్‌ తదితర కోర్సుల్లో చేరడానికి రైతు కోటాలో అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని రిజిస్ట్రార్‌ డాక్టర్‌ జి.రామారావు ఆగస్టు 5న ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ angrau.ac.in ను సందర్శించాలన్నారు. దరఖాస్తులను వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకుని పూర్తి చేసి ఈనెల 16వ తేదీలోగా అందజేయాలన్నారు. బీఎస్సీ అగ్రికల్చర్‌ కోర్సులకు ఇంటర్‌ మార్కులతో ఎన్‌ఆర్‌ఐ, ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్‌ కోటాలో దరఖాస్తులను అభ్యర్థుల కోసం విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని తెలిపారు. అభ్యర్థులు దరఖాస్తులను డౌన్‌లోడ్‌ చేసుకుని పూర్తి చేసి ఆగస్టు 25లోగా అందజేయాలన్నారు.

చదవండి: 

Published date : 06 Aug 2022 04:16PM

Photo Stories