దూరవిద్యలో వ్యవసాయ సర్టిఫికెట్ కోర్సులు!
Sakshi Education
గుంటూరు రూరల్: దూర విద్య ద్వారా రైతులు, యువతకు వ్యవసాయంలో సర్టిఫైడ్ కోర్సులు అందించి అధునాతన పద్ధతుల్లో లాభసాటి వ్యవసాయం చేయించటమే తమ లక్ష్యమని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ అగ్రికల్చర్ డీన్ డాక్టర్ ఎ.ప్రతాప్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
సేంద్రియ వ్యవసాయం, మిద్దె తోటలు, పుట్టగొడుగులు, తేనెటీగల పెంపకం అనే అంశాలపై జూలై 2020 నుంచి 8 వారాలు వ్యవధి కలిగిన సర్టిఫికెట్ కోర్సులు అందిస్తున్నట్లు గురువారం ఓ ప్రకటనలో వివరించారు. ఆసక్తి గలవారు జూలై 15 లోగా రూ.1,000 చెల్లించి తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని విజ్ఞప్తి చేశారు.
Published date : 26 Jun 2020 03:25PM