Technolgical Skills Upgradation: టీచర్లు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి.. పాఠశాల విద్య కమిషనర్ సురేష్ కుమార్
Sakshi Education
ఉపాధ్యాయులు నిత్య విద్యార్థులుగా ఉండాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ సూచించారు.
ఏపీ ఎస్‌సీఈఆర్టీ ఆధ్వర్యంలో ‘సాల్ట్’ కింద టీచర్లకు సెప్టెంబర్ 13న ఆన్‌లైన్‌లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎస్.సురేష్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం విద్యార్థులు సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకుని అనేక అంశాలపై సొంతంగా అవగాహన పొందుతున్నారు. ఇందుకనుగుణంగా ఉపాధ్యాయులు సిద్ధంగా ఉండాలి’ అని సూచించారు. ఏపీ ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్ ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ బైజుస్‌తో ఒప్పందం నేపథ్యంలో డిజిటల్ బోధన వల్ల ఉపాధ్యాయ పోస్టులు కుదిస్తారనే ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు.
also read: APPSC: డిపార్టుమెంటల్ టెస్టుకు సెప్టెంబర్ 14 నుంచి దరఖాస్తులు
Published date : 14 Sep 2022 06:33PM