Skip to main content

Andhra Pradesh : గురుకులాల్లో ప్రవేశాలకు ద‌ర‌ఖాస్తు గడువు పొడిగింపు.. చివ‌రి తేదీ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : 2023-24 విద్యా సంవత్సరానికి గాను డా.బీఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశానికి గతంలో ఇచ్చిన గడువును మార్చి 31వ తేదీ వరకూ పొడిగించామని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ఒక ప్రకటన‌లో తెలిపారు.
ap social welfare minister merugu nagarjuna telugu news
Minister Merugu Nagarjuna

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 189 ఎస్సీ గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల కోసం గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ గడువు మార్చి 24వ తేదీ తో ముగియ‌గా.. దీన్ని మార్చి 31వ తేదీ వరకూ పొడిగిస్తున్నామని వివరించారు. ఆన్ లైన్ ద్వారా ఈ ప్రవేశాలకు దరఖాస్తులు సమర్పించాలన్నారు. 

అర్హులు వీరే..

social welfare gurukulam ap telugu news

ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు 5వ తరగతిలోకి, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు అర్హులని చెప్పారు. 5వ తరగతిలోకి ప్రవేశం కోసం విద్యార్థులు https://apgpcet.apcfss.in అనే వెబ్‌సైట్‌ ద్వారా, అలాగే ఇంటర్‌లో ప్రవేశం కోసం విద్యార్థులు https://apgpcet.apcfss.in/Inter అనే వెబ్‌సైట్‌ ద్వారా తమ దరఖాస్తులను మార్చి 31వ తేదీ లోపుగా సమర్పించాలని  మంత్రి నాగార్జున కోరారు. 

సీట్ల కేటాయింపు ఇలా..
గురుకుల సీట్ల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీల‌కు 75శాతం, బీసీ-సీ కేటగిరీకి చెందిన  క్రిస్టియన్ దళితులకు 12 శాతం, బీసీలకు 6 శాతం, ఓసీలకు 2శాతం రిజర్వేషన్ల ప్రకారంగా కేటాయించడం జరుగుతుందని మంత్రి వివరించారు.

Published date : 25 Mar 2023 07:38PM

Photo Stories