Skip to main content

ఈ యూనివర్సిటీకి ‘సిమాగో’ ర్యాంక్

ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సిమాగో యూనివర్సిటీస్‌ ర్యాంక్‌ లభించింది.
ANU scimago university rankings 2022
ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సిమాగో యూనివర్సిటీస్‌ ర్యాంక్‌

స్పెయిన్ దేశానికి చెందిన సిమాగో సంస్థ ప్రపంచ స్థాయిలో 2022వ సంవత్సరానికి గాను యూనివర్సిటీలకు ర్యాంకులను ప్రకటించింది. ఈ ర్యాంకులలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఓవరాల్‌ కేటగిరీలో ప్రపంచ స్థాయిలో 737వ ర్యాంకును, జాతీయ స్థాయిలో 84వ ర్యాంకును కైవసం చేసుకుంది. రీసెర్చ్‌ విభాగంలో ప్రపంచ స్థాయిలో 458వ ర్యాంకును, జాతీయ స్థాయిలో 70వ ర్యాంకును, ఇన్నోవేషన్ లో ప్రపంచ స్థాయిలో 415వ ర్యాంకును, జాతీయ స్థాయిలో 46వ ర్యాంకును, సొసైటియల్‌ విభాగంలో ప్రపంచ స్థాయిలో 246వ ర్యాంకును, జాతీయ స్థాయిలో 29వ ర్యాంకును సాధించింది. ఈ సందర్భంగా వీసీ ఆచార్య పి.రాజశేఖర్‌ మాట్లాడుతూ యూనివర్సిటీ అధికారులు, సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థుల సమష్టి కృíషి, యూనివర్సిటీలో ఉన్న ప్రమాణాలే ర్యాంకుల సాధనకు దోహదం చేస్తున్నాయని తెలిపారు.

Sakshi Education Mobile App
Published date : 17 May 2022 12:58PM

Photo Stories