Good News: లబ్దిదారుల ఖాతాల్లో రూ.13వేలు జమ.. వారం లోపు వీరికి కూడా
Sakshi Education
ఏపీలో అమ్మ ఒడి లబ్దిదారులకు సర్కారు Good News చెప్పింది. తెల్లరేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబంలోని ప్రభుత్వ లేదా ప్రైవేటు స్కూళ్లలో చదువుకునే పిల్లలకు ఏటా రూ.13వేలు అకౌంట్లో జమ చేస్తోంది.
కాగా ఈ ఏడాది 2023–24 విద్యా సంవత్సరానికి గాను అమ్మ ఒడి లబ్దిదారులకు వారి ఖాతాల్లో రూ.13వేలు జమ చేసింది. కానీ చాలా మంది లబ్దిదారులు కేవైసీ పూర్తి కానందువల్ల డబ్బులు ఆగిపోయాయి. వారికి వెంటనే డబ్బులు అందించాలనే ఉద్దేశంతో వారి జాబితాను విడుదల చేసింది.
కేవైసీ పూర్తి కాని వారు రెండు రోజుల్లో సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో వివరాలను అందజేయాలని ప్రభుత్వం సూచించింది. కేవైసీ పూర్తయిన వారికి వారం లోపలనే డబ్బులు అకౌంట్లో జమ చేస్తామని తెలిపింది.
Published date : 04 Aug 2023 05:19PM