Skip to main content

PSTU Literary Awards: తెలుగు వర్సిటీ సాహితీ పురస్కారాల ప్రదానం

నాంపల్లి: వివిధ ప్రక్రియల్లో ఉత్తమ గ్రంథాలను అందించిన పది మంది తెలుగు రచయితలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారాలు ప్రదానం చేసింది.
Telugu Varsity Literary Awards

ఒక్కో రచయితకు రూ.20,116 నగదు, శాలువా, ప్రశంస పత్రాలను అందజేసింది. న‌వంబ‌ర్‌ 12న సాయంత్రం వర్సిటీలోని ఎన్‌టీఆర్‌ కళా మందిరంలో ఏర్పాటు చేసిన ప్రదానోత్సవ సభకు వీసీ ఆచార్య వెలుదండ నిత్యానందరావు అధ్యక్షత వహించగా.. ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారు, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ కేవీ రమణాచారి ప్రసంగించారు.

చదవండి: Burra Venkatesham: తొలిసారిగా గవర్నర్‌ ప్రతిభా అవార్డులు.. నాలుగు విభాగాల నుంచి ఆహ్వానం..
తెలుగు సాహిత్యం, లలిత కళల్లో విశేషమైన కృషి చేసిన ప్రముఖులకు సాహితీ పురస్కారాలను ప్రదానం చేస్తున్న తెలుగు వర్సిటీ.. లలిత కళల్లో విద్యార్థులను నిష్ణాతులుగా తీర్చిదిద్దుతోందన్నారు. కళాకారుల జీవితాలు స్థిరీకరణ పొందడానికి ప్రణాళికలను రూపొందించాలని ఆయన సూచించారు.
తెలుగు విశ్వవిద్యాలయంలోని అంతర్జాతీయ తెలుగు కేంద్రం ద్వారా దేశ విదేశాల్లో తెలుగు భాష, సంస్కృతిని మరింత ప్రచారం చేయడానికి కృషి చేయాలని ఆచార్య వెలుదండ నిత్యానందరావుకు ఆయన సూచించారు.
సభకు అధ్యక్షత వహించిన ఉపాధ్యక్షుడు ఆచార్య వెలుదండ నిత్యానందరావు మాట్లాడుతూ.. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి వికాస తోడ్పాటుకు నూతన సంస్కరణలు తేవాలనే సంకల్పంతో మూలనిధిని ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. తొలుత తన వంతుగా రూ.50 వేలు చెక్కు రూపంలో రిజిస్ట్రార్‌కు అందజేసినట్లు చెప్పారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

తెలుగు భాషాభిమానులు, వాణిజ్య సంస్థలు విరాళాలు అందజేయాలని కోరారు. కార్యక్రమంలో తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షుడు ఆచార్య తంగెడ కిషన్‌ రావు, ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ ఆచార్య వై.రెడ్డి శ్యామల, విస్తరణ సేవా విభాగం సహాయ సంచాలకులు రింగు రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

 

Published date : 13 Nov 2024 01:31PM

Photo Stories