డిప్లొమా ఇన్ ఫార్మసీ సీట్ల కేటాయింపు తేదీ ఇదే..
షెడ్యూల్ ప్రకారం.. జనవరి 18, 19 తేదీల్లో ఆన్‌లైన్‌లో విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజును చెల్లించాలి. సర్టిఫికెట్ల పరిశీలన 19, 20 తేదీల్లో ఉంటుంది. కళాశాలల ఎంపికను 19 నుంచి 21వ తేదీలోపు ఎంచుకోవాలి. 23న సీట్ల కేటాయింపు ఉంటుంది. 24 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
చదవండి: After 10+2: ఇంటర్మీడియెట్ తర్వాత ఫార్మసీ కోర్సులు.. కెరీర్‌కు ధీమా
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం సాంకేతిక విద్య, శిక్షణ మండలి జారీ చేసిన డీఫార్మసీ సెట్–2022 ర్యాంక్ కార్డ్, ఇంటర్ మార్కుల జాబితా, పదో తరగతి లేదా దానికి సమానమైన మార్కుల మెమో, ఆరు నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిమిత్తం తెల్లరేషన్ కార్డు, తాజా ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు అవసరం.
చదవండి: Pharmacy Students: నేరేడు ఆకుల్లోనూ ఔషధాలు..ఫార్మసీ విద్యార్థుల పరిశోధన
అలాగే క్రీడా అభ్యర్థులు, దివ్యాంగులతోపాటు భారత సైన్యం సంతతి సంబంధిత సర్టిఫికెట్లు సిద్ధంగా ఉంచుకోవాలి. దివ్యాంగులు, ఎన్‌సీసీ, క్రీడా కోటాకు అర్హులైనవారు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం జనవరి 19న విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇతరులు 19, 20 తేదీల్లో విజయవాడతో సహా విశాఖపట్నం ప్రభుత్వ పాలిటెక్నిక్, కడప ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలల్లోని హెల్ప్‌లైన్ సెంటర్‌లలో ఉదయం 9 గంటలకు సిద్ధంగా ఉండాలి. 1వ ర్యాంకు నుంచి చివరి ర్యాంక్ వరకు అందరికీ ఇదే షెడ్యూల్ వర్తిస్తుందని నాగరాణి తెలిపారు.