Medical college Admissions: మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు ప్రారంభం
నర్సంపేట రూరల్: ప్రజలకు మెరుగైన వైద్య సేవ లందించేందుకు ప్రభుత్వం జిల్లాకు ఒక వైద్య కళాశాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందు లో భాగంగా వరంగల్ జిల్లా వైద్య కళాశాలను నర్సంపేట పట్టణంలో ఏర్పాటు చేశారు. ఈ ఏడాది 50 సీట్లతో మెడికల్ కాలేజీకి జాతీయ వైద్యమండలి అనుమతి ఇచ్చింది. ఈనెల 24 నుంచి కౌన్సెలింగ్ కోసం విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకు న్నారు. రాజస్తాన్కు చెందిన సుబోధ్ శర్మ గురు వారం కళాశాలలో మొదటి అడ్మిషన్ తీసుకున్నాడు.
ఉద్యోగులకు విద్యార్థులకు సెప్టెంబర్ నెలలో వరుసగా 5రోజులు సెలవులు: Click Here
జిల్లా ఆస్పత్రిలోనే వైద్య కళాశాల..
నర్సంపేట పట్టణంలో 1999లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను 50 పడకలతో ప్రారంభించారు. అనం తరం మాతాశిశు సంక్షేమం కింద మరో 20 పడక లను పెంచారు. డిసెంబర్ 2021న నర్సంపేట సీహెచ్సీని జిల్లా ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మరిన్ని సేవ లు అందుబాటులోకి వచ్చాయి.
మొదట మూడు బ్లాక్ కే పరిమితి చేసి, 250 పడకల ఆస్పత్రి నిర్మిస్తామని పనులు ప్రారంభించారు. నర్సంపేట జిల్లా ఆస్పత్రికి అనుసంధానంగా 2023లో ప్రభు త్వం వైద్య కళాశాలను మంజూరు చేసింది. జిల్లా ఆస్పత్రి కోసం నిర్మించిన మూడు భవనాల్లోనే ఒక భవనాన్ని వైద్య కళాశాలకు కేటాయించింది. దీంతో ఇటీవల జాతీయ వైద్య మండలి పరిశీలించి సౌక ర్యాలు లేవనే ఈ ఏడాది బోధనకు నిరాకరించింది. కొంత సమయం ఇచ్చి మరోసారి పరిశీలిస్తామని, సౌకర్యాలు కల్పిస్తే అనుమతి ఇస్తామని తేల్చి చె ప్పింది. అన్ని వసతులు కల్పించి మరోసారి అధికా రులు అనుమతి కోరగా జాతీయ వైద్య మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దీంతో ఈనెల 24 నుంచి కౌన్సెలింగ్లో నర్సంపేట మెడికల్ కాలేజీ పేరు రావడంతో విద్యార్థులు కళాశాలను ఎంచుకుంటు న్నారు. రాజస్తాన్కు చెందిన విద్యార్థి సుబోధ్ శర్మకు ప్రిన్సిపాల్ మోహన్దాస్కు అడ్మిషన్ ఫాంను అం దించారు. మొదటి అడ్మిషన్ పొందిన ఆయనను కళాశాల ప్రిన్సిపాల్ మోహన్దాస్, పలు విభాగాల హెచఓడీలు, ప్రొఫెసర్లు అభినందించారు.