‘విశ్వ’విద్యాలయంగా ఏఎఫ్‌యూ
తాజాగా జూన్ 23న విశ్వవిద్యాలయానికి కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (సీఓఏ) బృందం విచ్చేసి విశ్వవిద్యాలయాన్ని పరిశీలించి కౌన్సిల్ అనుమతులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మే 12న ఏఐసీటీఈ (ఆలిండియా కౌన్సిల్ ఫార్ టెక్నికల్ ఎడ్యుకేషన్) అధికారులు వర్చువల్ విధానంలో పాల్గొని విశ్వవిద్యాలయానికి గుర్తింపు ఇచ్చేందుకు అంగీకరించారు. దీనికి సంబంధించి అనుమతి పత్రాలు ఈనెలాఖరులోపు రానున్నట్లు విశ్వవిద్యాలయ అధికారులు పేర్కొన్నారు.
చదవండి:
Degree: యూజీ ఆనర్స్.. ఇక జాబ్ ఈజీ
TAFRC: త్వరలో ‘వైద్య’ ఫీజుల పెంపు!.. కారణం ఇదే
Disaster Management Authority: ట్రైనీ ఐఏఎస్‌లకు విపత్తుల నిర్వహణపై శిక్షణ
విశ్వవిద్యాలయం సందర్శన..
వైఎస్‌ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్‌ఆర్ట్స్ విశ్వవిద్యాలయాన్ని కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (సీఓఏ) అధికారులు పరిశీలించారు. సీఓఏ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ నవీన్‌శర్మ (రాయపూర్), ఆర్కిటెక్ పుస్కర్ కన్విండే (పూణే)లు విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ కోర్సుకు సంబంధించిన మౌలిక సదుపా యాలు, ల్యాబ్‌లు, ప్రవేశాలు, పరీక్షా ఫలితాలు, సాంకేతిక అంశాలను పరిశీలించారు. అనంతరం వీసీ ఆచార్య బానోతు ఆంజనేయప్రసాద్, రిజిస్ట్రార్ ఆచార్య ఇ.సి. సురేంద్రనాథ్‌రెడ్డిలను కలిసి చర్చించారు.