Dr G Samaram: గోరా టెక్నో హబ్‌తో విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం
విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని నాస్తిక కేంద్రంలో డాక్టర్ జి.సమరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోరా టెక్నో హబ్‌ను కలెక్టర్ ఢిల్లీరావు ఫిబ్రవరి 28న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎంతో గొప్ప ఉద్దేశంతో, సేవాభావంతో, దార్శనికతతో సమరం టెక్నో హబ్ ఏర్పాటు చేశారన్నారు. రోబోటిక్స్, కృత్రిమ మేథ, క్వాంటం కంప్యూ టింగ్, సూపర్ కండక్టర్స్ తదితర ఆధునిక సాంకేతికతలకు సంబంధించి శాస్త్రీయ అవగాహనను పెంపొందించేలా ఈ టెక్నో హబ్ ఉందన్నారు.
చదవండి: New York Medical School: కాలేజీకి భారీ విరాళం.. విద్యార్థుల ట్యూషన్ ఫీజు మాఫీ!
దేశాన్ని శాస్త్రసాంకేతిక రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించ డంలో యువతను భాగస్వామ్యం చేసే ఉద్దేశంతో ఈ హబ్‌ను ఏర్పాటు చేసినందుకు డాక్టర్ సమరంనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం డాక్టర్ జి.సమరం మాట్లాడుతూ.. దేశీయ శాస్త్రసాంకేతికతల ద్వారా వికసిత్ భారత్‌ను సాకారం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ లక్ష్మీదేవి, ప్రొఫెసర్ నరేష్, మారు, రష్మీ సమరం తదితరులు పాల్గొన్నారు.