Skip to main content

New York Medical School: కాలేజీకి భారీ విరాళం.. విద్యార్థుల ట్యూషన్‌ ఫీజు మాఫీ!

Albert Einstein College of Medicine   New York Medical School Scrap Tuition Fees After Getting Donation    Reduced Fee Burden for Students

ఆ మెడికల్ కాలేజీకి  ఊహించని రీతిలో ఒక బిలియన్ డాలర్లు(రూ. 10 కోట్లు) విరాళంగా అందాయి. దీంతో ఆ కాలేజీ యాజమాన్యం విద్యార్థుల ట్యూషన్ ఫీజులను మాఫీ చేసి, వారికి ఫీజు భారాన్ని తగ్గించింది. యునైటెడ్ స్టేట్స్‌లోని ఆల్బర్ట్ ఐన్స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌లో ఈ ఉదంతం చోటుచేసుంది. 

ఆల్బర్ట్ ఐన్స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌ విద్యా సంస్థకు భారీ విరాళం అందడంతో, ఆ కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థులందరి వార్షిక ట్యూషన్ ఫీజును మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కళాశాలకు అనుబంధ ఆసుపత్రి, మోంటెఫియోర్ మెడికల్ సెంటర్ ఉన్నాయి. ఈ కాలేజీ యునైటెడ్ స్టేట్స్‌లోని వెనుకబడిన ప్రాంతంలో ఉంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రాంతంలో ఆరోగ్య పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయి. కాలేజీ యాజమాన్యం విద్యార్థుల ట్యూషన్‌ ఫీజు మాఫీకి సంబంధించిన ప్రకటనను  సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

ఈ ప్రకటన విన్న విద్యార్థులంతా ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ  ఆ వీడియోలో కనిపించారు. ఈ విరాళాన్ని ఐన్‌స్టీన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్‌, మాంటెఫియోర్ హెల్త్ సిస్టమ్ బోర్డ్ మెంబర్ రూత్ ఎల్ గాట్స్‌మాన్ అందించారని కాలేజీ యాజమాన్యం పేర్కొంది. 

Published date : 28 Feb 2024 05:49PM

Photo Stories