Scholarships: ఈ మెరిట్ స్కాలర్‌షిప్‌నకు ఆధార్ తప్పనిసరి
Sakshi Education
ఒంగోలు: నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్‌నకు ఆధార్ తప్పనిసరి అని ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు డి.దేవానంద్ మార్చి 11న ఒక ప్రకటనలో తెలిపారు.
గత ఏడాది ఆధార్ మిస్‌మాచ్ అయినప్పటికీ బ్యాంకు పాస్‌బుక్ వివరాలు నమోదు చేయడం ద్వారా కొంతమంది విద్యార్థులు నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో నమోదు చేసుకుని ఉపకార వేతనం పొందగలిగారన్నారు. కానీ ఈ ఏడాది రెన్యువల్‌కు మాత్రం విద్యార్థి వివరాలు ఆధార్‌తో తప్పనిసరిగా సరిపోలాలన్నారు.
చదవండి: Scholarships అంబేద్కర్‌ఓవర్సీస్ విద్యానిధికి దరఖాస్తులు ఆహ్వానం.. చివరి తేదీ ఇదే
ఇటువంటి విద్యార్థులు తమ వివరాన్నీ ఆధార్‌తో సరిపోయేలా సవరించుకుని మార్చి 13వ తేదీలోపు స్టడీ సర్టిఫికెట్, బ్యాంకు పాస్‌బుక్, పోర్టల్ అప్లికేషన్ జిరాక్స్ కాపీలను జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలన్నారు.
చదవండి: BC Overseas Vidya Nidhi scholarship: విదేశీ విద్యకు రూ. 20 లక్షల సాయం, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చంటే..
Published date : 12 Mar 2024 04:43PM