TSCHE: మూడో ‘దోస్త్’లో 72 వేల సీట్లు.. గ్రూపులో వారిగా సీట్ల కేటాయింపు ఇలా..
సీట్లు పొందిన విద్యార్థులు జూలై 25వ తేదీలోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు. 55,313 మంది విద్యార్థులకు వారు ఇచ్చిన మొదటి ప్రాధాన్యత ప్రకారం సీట్లు కేటాయించామన్నారు. రెండో ప్రాధాన్యత కింద 17,636 మందికి సీట్లు కేటాయించామన్నారు. మూడో దశలో 63,484 మంది కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 79,356 మంది ఆప్షన్లు ఇచ్చారు.
చదవండి: Degree: నైపుణ్యాలు పెంచేలా ఆనర్స్ డిగ్రీ.. ప్రవేశాల షెడ్యూల్ ఇలా..
ఆగస్టు 1 నుంచి ప్రత్యేక దశ ప్రవేశాలు
ఆగస్టు 1వ తేదీ నుంచి స్పెషల్ అడ్మిషన్ల ప్రక్రియ ఉంటుందని ఉన్నత విద్యా మండలి తెలిపింది. స్పెషల్ అడ్మిషన్ల ప్రక్రియకు ఆగస్టు 11 వరకూ రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని, 12వ తేదీ వరకూ వెబ్ ఆప్షన్లు ఇవ్వొచ్చని, 16వ తేదీన సీట్లు కేటాయిస్తారని తెలిపింది. ఆగస్టు 19వ లోగా సీట్లు పొందిన ప్రతీ విద్యార్థి కాలేజీలో రిపోర్టు చేయాలని సూచించింది.
చదవండి: Degree: యూజీ ఆనర్స్.. ఇక జాబ్ ఈజీ
ఏ గ్రూపులో ఎన్ని సీట్ల కేటాయింపు?
గ్రూపు |
సీట్ల కేటాయింపు |
ఆర్ట్స్ |
10,939 |
కామర్స్ |
32,209 |
లైఫ్ సైన్సెస్ |
16, 859 |
ఫిజికల్ సైన్సెస్ |
12,620 |
డి ఫార్మసీ |
235 |
ఇతర గ్రూపులు |
87 |