Rahila Banu: 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన 51 ఏళ్ల మహిళ
Sakshi Education
అన్నానగర్(చెన్నై): కరూర్‌లో 41 ఏళ్ల మహిళ 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. వివరాలు.. కరూర్ జిల్లా కృష్ణరాయపురం ప్రాంతానికి చెందిన రహీలా భాను (51). ఈమె పూవంబాడి పంచాయతీ యూనియన్ మిడిల్ స్కూల్‌లో వంటపని చేస్తోంది. 1989లో 9వ తరగతి పూర్తి చేసిన ఈమె కుటుంబ పరిస్థితుల కారణంగా పాఠశాలకు వెళ్లలేదు.
ఈ క్రమంలో 10వ తరగతి ఉత్తీర్ణులైతేనే న్యూట్రిషన్ ఆర్గనైజర్ పోస్టుకు అర్హత సాధించే అవకాశం ఉన్నందున 10వ తరగతి పరీక్షలు హాజరు కావాలని నిర్ణయించుకుని గత ఏప్రిల్‌లో జరిగిన 10వ తరగతి సాధారణ పరీక్షలకు ప్రత్యేక అభ్యర్థిగా దరఖాస్తు చేసుకుంది.
చదవండి: ITI Courses After 10th: సత్వర ఉపాధికి కేరాఫ్ ఐటీఐ
ఈమె ఇంగ్లీషు, సోషల్‌సైన్స్‌లో ఉత్తీర్ణత సాధించింది. ఆపై తాను ఉత్తీర్ణత సాధించని తమిళం, గణితం, సైన్స్ సబ్జెక్టులకు జూన్‌లో జరిగిన సప్లిమెంటరీ పరీక్షకు దరఖాస్తు చేసిపరీక్ష రాసింది. ఈ క్రమంలో 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఇందులో రహీలా భాను తమిళం, గణితం, సైన్స్ సబ్టెక్టుల్లో ఉత్తీర్ణులయ్యారు.
Published date : 28 Jul 2023 03:08PM