TS CPGET 2022: పీజీ ప్రవేశాల రెండో విడత కౌన్సెలింగ్ తేదీలు ఇవే..
Sakshi Education
ఉస్మానియా యూనివర్సిటీ: TS CPGET – 2022 రెండో కౌన్సెలింగ్‌లో భాగంగా నవంబర్ 14 నుంచి 17 వరకు పేర్లను నమోదు చేసుకోవాలని కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి నవంబర్ 13న ఒక ప్రకటనలో సూచించారు.
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ వర్సిటీల్లో పలు పీజీ కోర్సులు, పీజీ డిప్లొమాలు, ఐదేళ్ల పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నవంబర్ 19వ తేదీ నుంచి 21 వరకు వెబ్‌ఆప్షన్లు, 22న ఎడిటింగ్, 25న సీట్లు సాధించిన విద్యార్థుల జాబితా విడుదల, 26 నుంచి 30 వరకు కళాశాలల్లో రిపోరి్టంగ్ ఉంటాయని వివరించారు.
చదవండి:
Published date : 14 Nov 2022 01:09PM