BRAOU: ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాలి
Sakshi Education
కాగజ్‌నగర్‌టౌన్: డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులు ఫిబ్రవరిలో నిర్వహించే వార్షిక పరీక్షల ఫీజు చెల్లించాలని కోఆర్డినేటర్ తూడురు దత్తాత్రేయ డిసెంబర్ 26న ఒక ప్రకటనలో తెలిపారు.
డిగ్రీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు సెమిస్టర్– 3, తృతీయ సంవత్సరం వారు సెమిస్టర్– 5 వార్షిక పరీక్షల ఫీజును ఎలాంటి అపరాధ రుసుం లేకుండా జనవరి 17 వరకు చెల్లించవచ్చని తెలి పారు.
చదవండి: Gurukula School jobs: గురుకుల పాఠశాలలో ఉద్యోగాలకు దరఖాస్తులు
అలాగే రూ.500 అపరాధ రుసుంతో జనవరి 23 వరకు ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. సబ్జె క్టు కోడ్‌ను ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా పొందుపర్చాలని సూచించారు. ఇతర వివరాల కోసం 98663 98678, 73829 29651, 94943 14314 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
Published date : 28 Dec 2023 07:44AM