Admissions: దూరవిద్య ప్రవేశాల గడువు పొడిగింపు
దరఖాస్తులు ఆన్‌లైన్‌లో లేదా నేరుగా దూరవిద్య కేంద్రంలో పొందవచ్చని సూచించారు. రూ.300 అపరాధ రుసుముతో డిగ్రీ బీకాం జనరల్, కంప్యూటర్, బీబీఏ, బీఎస్సీ, పీజీ కోర్సుల ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చని పేర్కొన్నారు.
చదవండి: కేయూ దూరవిద్య బీఎల్‌ఐఎస్సీ పరీక్షలు తేదీలు ఇవే..
ఈవిద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఇదే చివరి గడువు అని, తమ ఫీజులను ఎస్‌బీఐ, యూబీఐ ద్వారా డైరెక్టర్ ఎస్‌డీఎల్‌సీఈ కాకతీయ యూనివర్సిటీ పేరున కేయూ బ్రాంచ్ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ (ఎస్‌బీఐ ఎన్ 0020262) వరంగల్‌కు తీసిన డీడీ ద్వారాగానీ దూరవిద్య కేంద్రంలోని ఎక్స్‌టెన్షన్ కౌంటర్ నుంచి చలానా ద్వారా గానీ ఫీజు చెల్లించి ప్రవేశాలు పొందాలన్నారు. కోర్సుల వివరాలు ఇతర ఫీజుల వివరాలన్నీ సంబంధిత కేయూ ఎస్‌డీఎల్‌సీఈలో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు (0870–2461480), (0870–2461490)లో సంప్రదించాలని పేర్కొన్నారు. దూరవిద్య డిగ్రీ, పీజీ కోర్సుల్లో ఇప్పటికే ప్రవేశాలు పొందినవారు తమ దరఖాస్తులను వెంటనే దూరవిద్య కేంద్రంలో అందించాలని సూచించారు.