మధురానగర్ (విజయవాడ సెంట్రల్): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ కొత్తగా ప్రవేశపెట్టిన 4 పీజీ డిప్లమో కోర్సుల్లో ప్రవేశాలకు గడువు మే 30 వరకు పెంచినట్లు వర్సిటీ సహాయ సంచాలకులు డాక్టర్ ఎం.అజంతకుమార్ మే 11న తెలిపారు.
పీజీ డిప్లమో కోర్సులకు దరఖాస్తు గడువు పెంపు
వర్సిటీ పీజీ డ్లిపమో ప్రోగ్రామ్ ఇన్ మార్కెటింగ్, ఫైనాన్సియల్ మేనేజ్‌మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, ఆపరేషన్ మేనేజ్‌మెంట్ కోర్సులను కొత్తగా ప్రారంభించినట్లు చెప్పారు. ఈ కోర్సుల్లో ప్రవేశాలకు డిగ్రీ పూర్తిచేసిన వారు అర్హులని చెప్పారు. కోర్సుల్లో చేరేందుకు మార్చి 30తో గడువు ముగిసినప్పటికీ విద్యార్థుల కోరిక మేరకు గడువు పెంచినట్లు తెలిపారు. మరింత సమాచారం కోసం మాచవరం ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ ప్రాంతీయ అధ్యయన కేంద్రాన్ని సంప్రదించాలని కోరారు.