English Idioms: క్లోజ్ బట్ నో సిగర్
Sakshi Education
ఒక వ్యక్తి విజయం అంచుల వరకు వచ్చినా గెలుపు దక్కకపోవడం, ఏదైనా ప్రశ్నకు జవాబు చెప్పే విషయంలో దాదాపుగా దగ్గరికి రావడం, కాని చెప్పలేకపోవడం... మొదలైన సందర్భాలలో ఉపయోగించే ఇడియమ్...క్లోజ్ బట్ నో సిగర్.
ఉదా: 1. హి ట్రైడ్ టు బ్రేక్ ది రికార్డ్. ఇట్ వాజ్ క్లోజ్. బట్ నో సిగర్
2. ఏ: ఈజ్ ది ఆన్సర్ 73?
బి: హో! క్లోజ్, బట్ నో సిగర్. ఇట్స్ ఏ 75 యాక్చువల్లీ!
ఈ ఇడియమ్ పుట్టుక గురించి చెప్పుకోవాలంటే...
వన్స్ అపాన్ ఏ టైమ్ అమెరికాలో కార్నివాల్స్ లో జరిగే పోటీలలో విజేతకు ఖరీదైన ‘సిగరెట్’ బహుమతిగా ఇచ్చేవారట. గెలుపు సమీపానికి వచ్చి గెలవలేకపోయిన వారిని ఉద్దేశించి ప్రేక్షకులు ‘క్లోజ్ బట్ నో సిగర్’ అంటుండేవారు. 1930 తరువాత... రకరకాల సందర్భాలకు అనుగుణంగా దీన్ని వాడడం మొదలైంది.
Also read: Spoken English: ఇవి తెలుసుకుంటే... ఇంగ్లిష్‌లో ప్రశ్నించడం సులువే!
Published date : 30 Jul 2022 12:40PM