వ్యూహాత్మక ప్రిపరేషన్‌తో ‘కీర్తి’ శిఖరాలకు.. సివిల్స్ 89వ ర్యాంకర్ జె.కీర్తి
Sakshi Education
‘ఐఏఎస్ అనే పదానికి అర్థం తెలియనప్పటి నుంచే దానికి లభించే హోదా.. సామాజిక సేవ చేసేందుకు ఐఏఎస్‌కు లభించే విస్తృత పరిధి, నాయకత్వ లక్షణాల గురించి తండ్రి నిరంతరం చెప్పిన మాటలు.. అన్నిటికంటే ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ రంగంలో సేవా పరిధి శూన్యం’ అనే ఆలోచనలే సివిల్స్ దిశగా నడిపించాయంటున్నారు తొలి ప్రయత్నంలోనే 89వ ర్యాంకు సాధించిన జె.కీర్తి.
లక్ష్యమే నడిపించింది:
సివిల్స్‌లో నెగ్గాలనే లక్ష్యమే తొలి ప్రయత్నంలో విజయం దిశగా నడిపించింది. 2011లో బీటెక్ పూర్తికాగానే మే నెలలోనే కోచింగ్ కోసం ఢిల్లీ వెళ్లాను. మొదటి ప్రయత్నంలోనే సాధించాలనే తపనతో కృషి చేశాను. ఢిల్లీలో అడుగుపెట్టిన క్షణమే ఎట్టి పరిస్థితుల్లో తొలి యత్నంలో విజయం సాధించాలని నిర్ణయించుకున్నాను. అది ఫలించింది.
ప్రత్యేక వ్యూహంతో:
సివిల్స్ ప్రిపరేషన్‌లో సొంత వ్యూహాన్ని అనుసరించాను. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఫిలాసఫీ ఆప్షనల్స్‌కు కోచింగ్ మెటీరియల్‌తోపాటు ప్రామాణిక పుస్తకాలు చదివాను. ఒక్కో అంశానికి సంబంధించి చిన్న పరిమాణంలో ఉండే వాటిని ఎంచుకోవడం వల్ల తక్కువ సమయంలో నిర్దిష్ట టాపిక్‌ను పూర్తిచేశాను. స్కోరింగ్ ఉద్దేశంతో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌ను, స్వీయ ఆసక్తితో ఫిలాసఫీని ఆప్షనల్‌గా ఎంపిక చేసుకున్నాను. అంతేకాకుండా ఈ రెండిటికీ మంచి మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటుంది. వాస్తవానికి ఆప్షనల్ ఎంపికలో నాలుగు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. అవి స్కోరింగ్, క్లిష్టత, సిలబస్, ఆసక్తి. వీటన్నిటి ఆధారంగానే నేను ఆప్షనల్స్ ఎంచుకున్నాను.
సెల్ఫ్ ప్రిపరేషన్ సాగిందిలా:
ప్రతి టాపిక్‌కు సంబంధించి సొంత అభిప్రాయం ఏర్పడే కోణంలో చదివాను. అదేవిధంగా సీనియర్స్‌తో ఇంటరాక్షన్, గ్రూప్ స్టడీ, గ్రూప్ డిస్కషన్‌లలో పాల్పంచుకున్నాను. జనరల్ స్టడీస్ విషయంలో ఇన్‌స్టిట్యూట్ మెటీరియల్‌తోపాటు సొంత నోట్స్, న్యూస్ పేపర్ రీడింగ్ ఉపయోగపడింది. మెయిన్స్‌ను రైటింగ్ గేమ్‌గా వర్ణించొచ్చు. కాబట్టి ప్రిపరేషన్ సమయంలో రైటింగ్ ప్రాక్టీస్ బాగా చేశాను. ప్రతి అంశాన్ని 360 డిగ్రీస్ వ్యూతో చదవడం అలవర్చుకున్నాను. అదే నా విజయానికి ప్రధాన కారణం.
ప్రిలిమ్స్ సులువుగా:
కోచింగ్ కోసం ఢిల్లీకి వెళ్లడం, అకడెమిక్‌గా బీటెక్ నేపథ్యం కావడంతో ప్రిలిమ్స్ ఎంతో సులభంగా పూర్తిచేశాను. ముఖ్యంగా రెండో పేపర్ (ఆప్టిట్యూడ్ టెస్ట్) విషయంలో నా అకడెమిక్ నేపథ్యం చాలా ఉపకరించింది. గంటన్నరలోపే పేపర్ పూర్తి చేశాను. 80 ప్రశ్నలకుగాను 79 ప్రశ్నలు అటెంప్ట్ చేశాను. అప్పుడే.. మెయిన్స్‌కు క్వాలిఫై అవుతాననే విశ్వాసం ఏర్పడింది. దీంతో ప్రిలిమ్స్ అయిన రెండో రోజు నుంచే మెయిన్స్‌కు ప్రిపరేషన్ మొదలు పెట్టాను.
మెయిన్స్‌కు ప్రధానమైనవి:
మెయిన్స్ ప్రిపరేషన్‌కు ప్రధానమైన అంశం టైం మేనేజ్‌మెంట్. విస్తృతంగా ఉండే సిలబస్‌ను నాలుగు నెలల్లో పూర్తి చేయడం సాధ్యం కాదు. కాబట్టి శాస్త్రీయ దృక్పథంతో అడుగులు వేయాలి. బాగా అన్వేషించి నాణ్యమైన మెటీరియల్‌ను ఎంచుకోవాలి. ప్రశ్నలు.. అభ్యర్థిలోని విశ్లేషణ నైపుణ్యాన్ని పరీక్షించే విధంగా వస్తాయి. కాబట్టి ఆ కోణంలోనే ప్రిపరేషన్ సాగించాను. ప్రతి అంశంపై సొంతంగా నిర్దిష్ట అభిప్రాయం కలిగేలా చదివాను. అలాగని.. గంటలకొద్దీ చదవాల్సిన అవసరం లేదు. నేను కొన్ని రోజులు ఉదయం నాలుగు గంటలకే నిద్రలేచి చదివాను. కొన్ని రోజులు తెల్లవారుజాము మూడు గంటల వరకు చదివాను. టైం కేటాయింపు అనేది అభ్యర్థి సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ఇలా.. వ్యూహాత్మకంగా ప్రిపరేషన్ సాగించి మెయిన్స్‌కు హాజరయ్యాను. మెయిన్స్ అన్ని పేపర్లు పూర్తయ్యాక కచ్చితంగా ఇంటర్వ్యూ కాల్ వస్తుందని ఊహించాను. అందుకే ఢిల్లీలోనే ఉన్నాను. మెయిన్స్, ఇంటర్వ్యూ మధ్య వ్యవధిలో ఢిల్లీలోని నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్‌లో అసిస్టెంట్ రీసెర్చ్ ఎనలిస్ట్‌గా మూడు నెలలు పని చేశాను.
ఇంటర్వ్యూ.. వెరీ హ్యాపీ:
ఐ.ఎం.జి.ఖాన్ బోర్డ్‌తో ఇంటర్వ్యూ 25 నిమిషాలపాటు ఆహ్లాదకర వాతావరణంలో సాగింది. ఎక్కువగా సమకాలీన అంశాలపైనే ప్రశ్నలు అడిగారు. అవి..

- ఉద్యోగం ఏమైనా చేశారా?
- చైల్డ్ రైట్స్ అంటే ఇష్టమా? ఎందుకు?
- మహిళలపై అకృత్యాలు పెరుగుతున్నాయి. దీనికి సంబంధించి సమస్యలు, పరిష్కారాలు చెప్పండి?
- యువత సమాజానికి ఎలా సహాయం చేస్తుంది?
- ఆంధ్రప్రదేశ్‌లో నక్సలిజం గురించి చెప్పండి?
- తెలంగాణ ఉద్యమం గురించి చెప్పండి?
- జువనైల్ క్రైమ్ అంటే ఏంటి?
- మీడియాకు నియంత్రణ అవసరమా?
- దేశ వ్యవసాయదారులకు తోడ్పాటును అందించడంలో ఏపీఎంసీ ఎలా పని చేస్తోంది?
అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను. అంతేకాకుండా తిరిగొచ్చేటప్పుడు ‘బోర్డ్’ చైర్మన్ ‘వెరీ నైస్ టాకింగ్ టు యు’ అని చెప్పడంతో.. ఎంతో ఆనందానికి గురయ్యాను. ఏదో ఒక సర్వీస్ వస్తుందని భావించాను.
సలహా:
సివిల్స్ ఔత్సాహికులకు ప్రధానంగా ఉండాల్సింది ఓపిక, సహనం. కారణం ఈ ప్రక్రియ ఏడాదిన్నరపాటు ఉంటుంది. ఏ క్షణంలో ఓర్పు కోల్పోయినా అప్పటివరకు పడిన శ్రమ వృథానే. సొంతగా క్రమశిక్షణ పాటిస్తూ, ఆసక్తితో చదవాలి. న్యూస్ పేపర్ ఎడిటోరియల్స్ చదవడం ఎంతో ఉపయోగపడుతుంది. ఏదైనా ఒక అంశాన్ని మొదలు పెట్టినప్పుడు అది పూర్తయ్యే వరకు వదలకూడదు అనే అకుంఠిత దీక్షతో ఏకాగ్రతతో చదవాలి. చదువుతున్న అంశం అవసరమైనదా?కాదా? అని విశ్లేషించుకుంటూ సాగితే సివిల్స్ విజయం సులభమే.
కీర్తి కుటుంబ నేపథ్యం:
తండ్రి: జెల్లి కనకయ్య (ప్రభుత్వ న్యాయవాది)
తల్లి: వసంత (గృహిణి)
సోదరి: ఐశ్వర్య (ట్రిపుల్‌ఐటీ అలహాబాద్‌లో సీఎస్‌ఈ)
అకడెమిక్ ప్రొఫైల్:
పదో తరగతి (2004): 540 మార్కులు
ఇంటర్మీడియెట్ (2006): 870 మార్కులు
బీటెక్ (2011): 63 శాతం

Published date : 20 May 2013 08:25PM