తండ్రి లక్ష్యం నెరవేర్చా.. మల్లవరపు సూర్యతేజ – సివిల్స్ 76వ ర్యాంకు
Sakshi Education
గుంటూరులోని శ్యామలనగర్‌కు చెందిన మల్లవరపు సూర్యతేజ రెండో ప్రయత్నంలోనే సివిల్స్ సాధించారు.
‘నేను ఐఏఎస్ కావాలన్నది నా తండ్రి లక్ష్యం. 2014లో ఆయన మరణించారు. నా తండ్రి లక్ష్యం నేరవేర్చడం కోసం టీసీఎస్‌లో వచి్చన జాబ్‌ను కూడా వదలుకుని కఠోర దీక్షతో చదివాను. నా రెండో ప్రయత్నంలోనే 76వ ర్యాంకు సాధించడం ఆనందంగా ఉంది. నా ఈ విజయంలో మా అమ్మ సంధ్యారాణి సహకారం కూడా చాలా ఉంది. పేద విద్యార్ధులకు నాణ్యమైన విద్య, స్కిల్ డెవలప్‌మెంట్, పబ్లిక్ హెల్త్‌పై ఫోకస్ చేయడమే నా లక్ష్యం’అని వివరించారు.
Published date : 05 Aug 2020 06:06PM