సివిల్స్ 2013లో మోగిన ‘తెలుగు’ఢంకా!
Sakshi Education
సివిల్స్‌లో తెలుగు ఢంకా మోగింది. అఖిలా భారతీయ సర్వీసులో లక్షలాది మందితోపోటీపడిన ఉభయరాష్ట్రాల యువతీ యువకులు అధికసంఖ్యలో సివిల్‌సర్వీసెస్‌కు ఎంపిక య్యారు. యూపీఎస్సీ గురువారం సాయంత్రం సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2013 ఫలితాలను వెల్లడించింది. దీనిలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది రాసిన పరీక్షలో 1228 మంది ఐ ఏయస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, సెంట్రల్ సర్వీసెస్, గ్రూప్ బి సర్వీసెస్‌కు ఎంపికవగా, 1122 మంది ఐఏఎస్,ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ సర్వీసులకు ఎంపికయ్యారు. వీరిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి దాదాపు 60 మంది వరకూ ఉండొచ్చని అంచనా. వీరిలో అధికభాగం ఐఏఎస్, ఐపీఎస్‌లకు ఎంపికయ్యే అవకాశాలుండటం విశేషం.
విభాగాల వారీగా జనరల్ కేటగిరి నుంచి 517, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీల నుంచి 326, 187,92 మంది అభ్యర్థులు అఖిలభారత సర్వీసులకు ఎంపికయ్యారు. వివిధ విభాగాల్లో వారు చూపిన ప్రతిభ ఆధారంగా వారికి సర్వీసులను కేటాయించారు. ఐఏఎస్‌కు ఎంపికైన 180 మంది అభ్యర్థులలో జనరల్ 90, ఓబీసీ 49, ఎస్సీ 27, ఎస్టీ 14 మంది ఉన్నారు. ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ (ఐఎఫ్‌ఎస్)కు ఎంపికైన 32 మంది అభ్యర్థుల్లో జనరల్ 17, ఓబీసీ 09, ఎస్సీ 04, ఎస్టీ 02 ఉన్నారు. ఐపీఎస్ కేటగిరిలో ఎంపికైన 150 మందిలో జనరల్ 75, ఓబీసీ 43, ఎస్సీ 24, ఎస్టీ 08 అభ్యర్థులున్నారు.
దేశసేవలో భాగస్వామ్యం
-క్రితిక జ్యోత్స్న, సివిల్స్ 30 ర్యాంకర్
నాన్న ఐఎఫ్‌ఎస్ ఆఫీసర్ కావటంతో మొదట్నుంచి నా ధ్యాస సివిల్స్‌పైనే ఉండేది. దాంతో అదే దీక్షతో కాంపిటేటివ్ ఎగ్జామ్‌కు ప్రిపేరయ్యాను. ఒక మహిళగా నేను సాధించిన విజయానికి గర్విస్తున్నా. గత కొన్నేళ్లుగా సివిల్స్‌కు ఎంపిక అవుతోన్న అమ్మాయిల సంఖ్య పెరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా శుభపరిణామం. ఇంటిని నడిపే నేర్పున్న గృహిణి సమాజాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దగలదని నేను నమ్ముతాను. అమ్మనాన్నల ప్రోత్సాహంతో ఈ ర్యాంకు సాధించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సాధించాలనే పట్టుదల, కష్టపడే తత్వం ఉంటే సాధారణ విద్యార్థులు కూడా సివిల్స్ సాధించటం చాలా ఈజీ.
నాన్నస్ఫూర్తితోఖాకీడ్రెస్
-సింధు శర్మ, 213
‘‘నాన్న పోలీస్ ఆఫీసర్. అధికారులకు సమాజంలో లభించే గౌరవం, దానికి మించి సేవచేస్తున్నామనే సంతృప్తి నాకు మొదటి నుంచి ఉత్సాహానిచ్చేవి. సమాజానికి దిశానిర్ధేశం చేసేందుకు సివిల్స్ సర్వీసెస్ ఒక్కటే ఏకైక మార్గమంటున్నా’’ అని సివిల్స్ 213 ర్యాంకర్ సింధు శర్మ పేర్కొన్నారు. ఐసిఎస్ అధికారి ఉమామహేశ్వర శర్మ కూమార్తె అయిన సింధు సివిల్స్ రెండో అటెంప్ట్‌లోనే మంచి ర్యాంకు సాధించటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. మొదటి అటెంప్ట్‌లోనే 357 ర్యాంకు సాధించిన ఆమె ప్రస్తుతం ఐఆర్‌ఎస్ సర్వీస్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగానికి సెలవుపెట్టి పరీక్ష రాసిన సింధు తన స్థాయి మెరుగు పరుచుకోగలిగారు.
ఐఏఎస్ కావాలనే ఉద్దేశంతో పరీక్షకు ప్రిపేరైనా.. ర్యాంకును బట్టి తాను ఐపీఎస్‌కు ఎంపికయ్యే అవకాశం ఉందన్నారు. ఏ కేటగిరిలో అయినా దేశానికి తమవంతు సేవ చేయటమే లక్ష్యమన్నారు. కేవలం జాబ్ చేస్తున్నామనేది గాకుండా ఆత్మసంతృప్తి, సవాళ్లతోకూడిన ఉద్యోగంగా ఈతరం యువత, ముఖ్యంగా అమ్మాయిలు సివిల్స్ సర్వీసెస్‌ను గుర్తించడం, ప్రతి సంవత్సరం ఎక్కువ మంది ఎంపిక అవుతుండడం శుభపరిణామని ఆమె పేర్కొన్నారు. అమ్మ ప్రోత్సాహం, నాన్న స్ఫూర్తితో తాను విజయం సాధించినట్లు సింధుశర్మ తెలిపారు. కష్టపడేతత్వం, ఓటమి ఎదురైనపుడు ఓర్పుతో అధికమించగలగటం వంటి లక్షణాలను అలవరచుకుంటే.. సివిల్స్‌లో విజేతగా నిలవటం సులువని యువతకు సూచిస్తున్నారు.
రెండోసారి విజయబావుటా
-పీయూష్ సమారియా, సివిల్స్ 165 ర్యాంకర్
ఎంచుకున్న లక్ష్యాన్ని చేరటం ఆనందంగా ఉంది. సివిల్స్ సర్వీసెస్‌కు ఎంపిక కావటంతో నా బాధ్యత మరింత పెరిగింది. సీనియర్ ఐఏఎస్ అధికారి కుమారుడిగా ప్రజలు నా నుంచి మరింతగా ఆశిస్తారు. వాటిని పూర్తిచేసి ప్రజలకు మరింత చేరువ కావటం నా ముందున్న సవాల్. మంచి ఆఫీసర్‌గా ప్రజలకు అందుబాటులో ఉండి తద్వారా దేశాభివృద్ధికి పాటుపడాలని ఉందని165 ర్యాంకర్ పీయూష్ సమారియా పేర్కొన్నారు. మొదటి అటెంప్ట్‌లో ఐఆర్‌ఎస్‌కు ఎంపికై ఇన్‌కంటాక్సు విభాగంలో అసిస్టెంట్ డెరైక్టరుగా పనిచేస్తున్న పీయూష్ గెలుపోటముల్లో వెన్నంటి నడిపించే నాన్నే తనకు స్ఫూర్తి అని పేర్కొన్నారు.
సమాజానికి సేవ చేసేందుకు ఉత్తమమైన మార్గం సివిల్స్. అందుకే మొదటిసారి ఆశించిన క్యాడర్ రాకపోవటంతో జాబ్‌కు సెలవుపెట్టి మరీ సీరియస్‌గా ప్రిపేరయ్యాను. కార్పొరేట్ కల్చర్ పరిచయం ఉన్న యువత కూడా గ్రూప్స్, సివిల్స్ వైపు మొగ్గు చూపటం మంచి పరిణామని పీయూష్ అభిప్రాయపడ్డారు. నాన్నగారు హరిలాల్ సమారియా ఐఏఎస్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ పేరును నిలపాల్సిన బాధ్యత నాపై ఉంది. అదేసమయంలో ప్రజలు నామీద ఉంచుకున్న నమ్మకాన్ని కాపాడుకోవాల్సిన అవసరమూ ఉంది.
లక్ష్యాన్ని సాధించాలనే క్రమంలో ఓటమిని ఓర్పుగా తట్టుకుని నిలబడటం అవసరం. ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఆ మనోస్థైర్ధ్యం ఎంతో అవసరం. ఇదే సివిల్ సర్వీసెస్ యాస్పిరెంట్స్‌కి పీయూష్ ఇచ్చిన సలహా.

Published date : 13 Jun 2014 02:32PM