UPSC Ranker Success Story : రాణి నువ్వు గ్రేట్.. తాత పేరు నిలబెట్టావ్.. మాజీ సీఎం మనుమరాలు అనే గర్వం లేకుండానే..
అన్నాదురై పేరు చెబితో మాకు తెలీదు అని చెప్పే తమిళుడు ఈ భూమ్మిద లేదంటే అది నిజం. అలాంటి మాజీ సీఎం మనుమరాలు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) పరీక్షల్లో సత్తాచాటుకున్నారు. పేరులోనే కాదు ఈమె చదువుల తల్లి సరస్వతి దగ్గర తాను రాణి అనిపించుకున్నారు. ఈమే పృథ్విక రాణి. ఈ నేపథ్యంలో యూపీఎస్సీ సివిల్స్ ర్యాంకర్ పృథ్విక రాణి సక్సెస్ స్టోరీ మీకోసం..
IPS Success Story : ఇంట్లో చెప్పకుండా.. ఐపీఎస్ కొట్టానిలా.. కానీ..
సీఎం మనుమరాలు అనే గర్వం లేకుండా.. సామాన్యురాలుగా..
పృథ్విక రాణి.. చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి చదివారు. ఎక్కడా తాను మాజీ సీఎం మనుమరాలు అనే గర్వపడకుండా సామన్య ప్రజలతో కలిసిపోయ్యారు ఈమె. పృథ్విక రాణి మొట్ట మొదటిసారి ప్రయత్నంలోనే యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలు రాసి ఒకే దెబ్బకు జాతీయ స్థాయిలో 171వ ర్యాంకు సాధించారు. ఐఏఎస్ అధికారి కావడానికి పృథ్విక రాణికి మంచి అవకాశం ఉన్నా.., ఆమె మాత్రం ఐఎఫ్ఎస్ (IFS) అధికారిగా ఎంపిక చేసుకున్నారు.
Success Story: ఈ లెక్కలే.. నన్ను 'ఐఏఎస్' అయ్యేలా చేశాయ్.. ఎలా అంటే..?
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ ప్రత్యేకంగా..
అమ్మా పృథ్విక రాణి నువ్వు గ్రేట్ అంటూ.. యూపీఎస్సీ సివిల్స్ పరీక్షల్లో 171వ ర్యాంకు సాధించారని తెలుసుకున్న వెంటనే ఆమెను మొదట అభినందించింది డీఎంకే పార్టీ చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్. తమిళ ప్రజలు ప్రాణాలతో ఉన్నంత వరకు అన్నాదురైని మరిచిపోరని, అలాగే నిన్ను కూడా తమిళ ప్రజలు గుండెల్లో పెట్టి చూసుకుంటారని, మీ తాతలాగా నువ్వు ప్రజాసేవకు అంకితం కావాలని మాజీ సీఎం మనుమరాలు పృథ్విక రాణిని ఈయన అభినందించారు.
IAS Success Story: మారుమూల పల్లెటూరి యువకుడు.. ఐఏఎస్ కొట్టాడిలా..