పక్కా ప్రణాళికతో విజయం.. సివిల్స్ 24వ ర్యాంకర్ పృథ్వీ
Sakshi Education
‘సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించాలంటే పకడ్బందీ ప్రణాళిక ఉండాలి. పటిష్ట ప్రణాళికతో ప్రిపరేషన్ సాగిస్తేనే విజయావకాశాలు మెరుగవుతాయి’ అంటున్నారు సివిల్ సర్వీసెస్ - 2017 ఫలితాల్లో జాతీయ స్థాయిలో 24వ ర్యాంకు సాధించి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టాపర్‌గా నిలిచిన ఇమ్మడి పృథ్వితేజ్.
ఐఐటీ-ముంబైలో బీటెక్ తర్వాత శాంసంగ్ సంస్థ ప్రధాన కార్యాలయం (దక్షిణ కొరియా)లో కోటి రూపాయల ప్యాకేజ్‌తో కొంత కాలం ఉద్యోగం చేసి.. సివిల్స్ లక్ష్య సాధన కోసం ఆ కొలువు వదిలి.. తొలి ప్రయత్నంలోనే 24వ ర్యాంకుతో విజయం సాధించిన పృథ్వితేజ్ సక్సెస్ స్పీక్స్.. ఆయన మాటల్లోనే...
మధ్య తరగతి కుటుంబం :
మా స్వస్థలం ద్వారకా తిరుమల. నాన్న శ్రీనివాసరావు నగల దుకాణం నిర్వహిస్తున్నారు. అమ్మ రాణి, గృహిణి. ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ద్వారకా తిరుమలలోనే చదివాను. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు గుడివాడలో నా చదువు కొనసాగింది. ఆ తర్వాత ఐఐటీలో సీటు లక్ష్యంగా ఇంటర్మీడియెట్ విజయవాడలో పూర్తిచేశాను. 2011 ఐఐటీ ఎంట్రన్‌సలో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకుతో ఐఐటీ ముంబైలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో చేరాను.
శాంసంగ్ ఇంటర్నేషనల్‌లో ఆఫర్ :
బీటెక్ 2015లో పూర్తయింది. క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్‌లో శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలో రూ.70 లక్షల ప్యాకేజ్‌తో ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగం లభించింది. చిన్నప్పటి నుంచీ సివిల్స్ లక్ష్యంగా ఉన్నప్పటికీ.. ప్రముఖ సంస్థ.. ఇంటర్నేషనల్ ఆఫర్ కావడంతో కొద్ది రోజులు పని చేద్దాం అనే ఉద్దేశంతో ఆ ఆఫర్‌తో కొరియా వెళ్లాను. అయితే నా మనసులో సివిల్స్ ఆశ కొనసాగుతూనే ఉండేది. దీంతో 2016 నవంబర్‌లో ఉద్యోగానికి రాజీనామా చేసి.. స్వదేశానికి తిరిగొచ్చేశాను. ఉద్యోగం వదిలేసే నాటికి రూ.కోటి వరకు వేతనం అందుతోంది.
సివిల్స్ ప్రిపరేషన్ :
2016 నవంబర్‌లో భారత్‌కు తిరిగొచ్చిన వెంటనే సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించాను. ఢిల్లీలో కొద్ది రోజులు ఒక ఇన్‌స్టిట్యూట్‌లో క్రాష్ కోర్సులో చేరాను. దీనివల్ల సివిల్ సర్వీసెస్ పరీక్షపై అవగాహనతోపాటు, ఆయా సబ్జెక్ట్‌ల బేసిక్స్‌పై పట్టు లభించింది. క్రాష్ కోర్సు పూర్తయ్యాక.. 2017 సివిల్స్ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేశాను. అప్పటి నుంచి సొంత ప్రిపరేషన్‌తో ముందుకు సాగాను. మ్యాథమెటిక్స్‌ను ఆప్షనల్‌గా ఎంపిక చేసుకోవడంతో.. మిగతా సబ్జెక్ట్‌ల ప్రిపరేషన్ పరంగా కొంత ఇబ్బంది ఎదురైంది. మ్యాథమెటిక్స్‌లో చిన్నప్పటి నుంచి పట్టు ఉండటంతో ప్రిలిమ్స్ సమయానికే ఈ ఆప్షనల్‌లో సగం సిలబస్‌ను పూర్తి చేశాను. మొత్తంగా రోజుకు 14 గంటలు ప్రిపరేషన్‌కు కేటాయించాను. వీటిలోని అధిక శాతం అంశాలు మెయిన్‌సలో ఉండటం కూడా కలిసొచ్చింది. ప్రిలిమ్స్‌కు చదివేటప్పుడే డిస్క్రిప్టివ్ విధానంలో చదవడం వల్ల మెయిన్‌సలో లాభించింది.
ఎగ్జామ్ ఓరియెంటేషన్ :
మొదట సిలబస్‌ను, పాత ప్రశ్నపత్రాలను అధ్యయనం చేసి.. పరీక్ష విధానంపై అవగాహన పెంచుకున్నాను. ఆ తర్వాత నా ప్రిపరేషన్ పూర్తిగా ఎగ్జామ్ ఓరియెంటేషన్‌తో సాగింది. ఆ మేరకు ముందే పటిష్టమైన ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను. అదే విధంగా ప్రిపరేషన్ సమయంలో రైటింగ్ ప్రాక్టీస్‌కు కూడా ప్రాధాన్యమిచ్చాను. ఫలితంగా తొలియత్నంలోనే విజయం లభించింది. వాస్తవానికి ఇంటర్వ్యూ పూర్తయ్యాక.. మంచి ర్యాంకు వస్తుందనే నమ్మకం కలిగింది. అయితే జాతీయ స్థాయిలో 24వ ర్యాంకు సాధిస్తానని ఊహించలేదు.
ఇంటర్వ్యూ.. ఇలా
సుజాత మెహతా ఆధ్వర్యంలోని బోర్డ్ నన్ను ఇంటర్వ్యూ చేసింది. కార్పొరేట్ కొలువు వదిలి సివిల్ సర్వీస్ వైపు ఎందుకు రావాలనుకుంటున్నారు? అనే ప్రశ్నపైనే దాదాపు అయిదారు నిమిషాలు చర్చ సాగింది. వీటితోపాటు ఆంధ్రప్రదేశ్ విభజన-అనంతర సమస్యలు, ఐఐటీల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు కారణాలు- ఒత్తిడి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? వంటి ప్రశ్నలు అడిగారు. వీటన్నిటికీ సంతృప్తికరంగానే సమాధానాలు ఇచ్చాను. ఇంటర్య్వూకు సంబంధించి మాజీ ఐఆర్‌ఎస్ అధికారి వెంకట్ మోహన్ ఇచ్చిన సలహాలు ఉపయోగపడ్డాయి.
తొలి ప్రయత్నంలో విజయం సాధ్యమే..
చాలామంది అభ్యర్థులు తొలి ప్రయత్నాన్ని తేలిగ్గా తీసుకుంటారు. దాన్ని ఒక ప్రాక్టీస్‌గా భావిస్తారు. కానీ.. ఆసక్తితో చదివితే తొలి ప్రయత్నంలోనే విజయం సాధించొచ్చు. కావలసిందల్లా అనునిత్యం ప్రిపరేషన్, ప్రాక్టీస్ సాగించడమే! ఒకవేళ ఏదైనా అంశాన్ని చదివేటప్పుడు బోర్ అనిపిస్తే.. వెంటనే తమకు ఇష్టమున్న మరో సబ్జెక్ట్‌వైపు దృష్టిపెట్టాలి. అప్పుడు కూడా ప్రిపరేషన్ కొనసాగించలేకపోతే..కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలి.
సేవే లక్ష్యం..
ప్రస్తుత ర్యాంకుతో ఐఏఎస్ వస్తుంది. ఈ సర్వీస్ ద్వారా నా పరిధిలో అందరికీ సేవ చేయడం, ప్రభుత్వ పథకాలు అన్ని వర్గాలకు అందేలా చేయడమే నా భవిష్యత్తు లక్ష్యం.

Published date : 08 May 2018 03:58PM