ఓటమి నుంచి విజయం వైపు.. సివిల్స్ 44వ ర్యాంకర్ సృజన,
Sakshi Education
‘సొంత ప్రిపరేషన్.. వరుసగా మూడుసార్లు ఓటమి.. ఇక మిగిలింది ఒకే ఛాన్స్.. ఎలాగైనా విజయం సాధించాలి.. మరోసారి ఎట్టిపరిస్థితిల్లోనూ తప్పులు పునరావృతం కాకూడదు.. ఒత్తిడికి తలొగ్గకుండా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వరుస వైఫల్యాలనే విజయానికి బాటగా మార్చుకున్నానంటున్న 44వ ర్యాంకర్ సృజన సక్సెస్ స్టోరీ ఆమె మాటల్లోనే..
చివరి ప్రయత్నంలో:
నాన్న ఐఏఎస్ అధికారి కావడం, ఆ హోదాతోనే ప్రజలకు ప్రత్యక్షంగా సేవచేయగలమన్న గట్టి నమ్మకమే ఐఏఎస్‌ను లక్ష్యంగా నిర్దేశించుకోవడానికి ప్రధాన కారణం. 2007లో హెచ్‌సీయూలో ఎంఏ పూర్తిచేయగానే సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించి వరుసగా మూడేళ్లు పరీక్ష రాశాను. ఈ మూడుసార్లూ విఫలమయ్యా. ఈ మధ్యలో గ్రూప్-1 రాయడం, లే సెక్రటరీగా ఎంపిక కావడం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఇదే సివిల్స్ చివరి ప్రయత్నంలో 44వ ర్యాంకు సాధించడానికి తోడ్పడింది.
ఆప్షనల్ మార్చుకుని.. ఆశయం నెరవేర్చుకుని:
2008, 2009లో పొలిటికల్ సైన్స్, సైకాలజీ ఆప్షన్స్‌తో హాజరయ్యాను. కానీ విజయం లభించలేదు. దీంతో లోపం ఎక్కడ అని అన్వేషించాను. ఆప్షనల్స్ సిలబస్ విషయంలో సమయం ప్రధాన సమస్యగా గుర్తించాను. అకడెమిక్స్ వేరు.. కాంపిటీటివ్ అందులోనూ యూపీఎస్సీ సివిల్స్ వేరు అని తెలుసుకున్నాను. లోపాలు, పొరపాట్లు అన్నీ తెలిశాయి. కానీ ఉన్నది ఒకే ఛాన్స్. వెంటనే రాస్తే.. పూర్వ అనుభవం ఎదురవుతుందనే భయం నెలకొంది. దీంతో రెండేళ్లు గ్యాప్ ఇచ్చాను. నాలుగోసారి సైకాలజీ బదులు ఫిలాసఫీతో హాజరయ్యాను. పొలిటికల్ సైన్స్ నా కోర్ సబ్జెక్టు కావడంతో దాన్ని మరో ఆప్షనల్‌గా తీసుకున్నాను.
ప్రిపరేషన్ సాగిందిలా:
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అంటే ఒక పోరాటమే. ఎంత కోచింగ్ తీసుకున్నప్పటికీ స్వీయ ప్రణాళిక లేకపోతే వృథానే. అందుకే కోచింగ్ తీసుకుంటూనే, అటు జనరల్ స్టడీస్, ఇటు ఆప్షనల్స్ విషయంలో ప్రతి సబ్జెక్ట్‌కు సంబంధించి ప్రామాణిక పుస్తకాలను చదివి, సొంత నోట్స్ రూపొందించుకున్నాను. ప్రతి రోజు ఏడు నుంచి ఎనిమిది గంటలు చదివాను.
ఇంటర్వ్యూ 25 నిమిషాలు:
ప్రొఫెసర్ పురుషోత్తమ్ అగర్వాల్ బోర్డ్ నన్ను ఇంటర్వ్యూ చేసింది. మొత్తం 25 నిమిషాలపాటు సాగిన ఇంటర్వ్యూలో నేను చెప్పే ప్రతి సమాధానాన్ని వారెంతో సహనంతో విన్నట్లే అనిపించింది. దీంతో ఇంటర్వ్యూలోనూ రాణిస్తానని, తుది ఫలితాల్లో నిలుస్తాననే నమ్మకం కలిగింది.
ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలు..

- చాణక్య పొలిటికల్ ఫిలాసఫీ ఏంటి?
- పర్యావరణ సమస్య, అభివద్ధిపై ప్రభావం?
- ఆంధ్రప్రదేశ్‌లో నక్సలిజం తగ్గుముఖం పడుతోంది. కారణమేంటి?
- మహిళా సాధికారత అంటే ఏంటి?
- వరకట్న నిషేధ చట్టం గురించి చెప్పండి?
- కర్నాటక్ మ్యూజిక్ గురించి వివరించండి?
అదే నా అదృష్టం:
మూడుసార్లు ఓటమి ఎదురైనా ఎప్పుడూ ఒత్తిడికి గురి కాకపోవడమే నా అదృష్టం. ఈ విషయంలో ప్రధానంగా నాన్న బలరామయ్య, ఇతర స్నేహితులు అందించిన సహకారం మరవలేనిది. ఎన్నడూ, ఎవ్వరూ నిరుత్సాహపరచలేదు. దానికి బదులు నువ్వు సాధిస్తావు అని వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఇదే నా విజయానికి ప్రధాన కారణం.
సలహా:
సివిల్స్ అభ్యర్థులకు నేను చెప్పే సలహా.. పుస్తకాలతో గంటలకొద్దీ కుస్తీ పడే వారిని చూసి ఆందోళన చెందొద్దు. చదివిన కొద్దిసేపైనా ఏకాగ్రతతో, నిజాయతీగా కష్టపడి చదివి విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి. సిలబస్‌ను నిర్దిష్ట సమయంలోపు పూర్తి చేసుకునేలా స్వీయ ప్రణాళిక అనుసరించాలి. ఈసారి మెయిన్స్ ప్యాట్రన్ మారి జీఎస్‌కు ప్రాధాన్యం పెరిగింది కాబట్టి ఇప్పట్నుంచే పకడ్బందీ వ్యూహం పాటించాలి.
సృజన కుటుంబ నేపథ్యం:
తండ్రి: జి. బలరామయ్య ఐఏఎస్ అధికారి
తల్లి: సుగుణశీల (గృహిణి)
భర్త: రవితేజ (హైకోర్ట్ అడ్వకేట్)
సోదరుడు: చార్వాక్ (ఎంబీఏ)
అకడెమిక్ ప్రొఫైల్
పదో తరగతి (2000)- 520 మార్కులు
ఇంటర్మీడియెట్ (2002)- 899 మార్కులు
బీఏ (2005)- 69 శాతం
హెచ్‌సీయూలో ఎంఏ(పొలిటికల్ సైన్స్-2007)- 85 శాతం (యూనివర్సిటీ టాపర్)
2008లో శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో పీహెచ్‌డీకి నమోదు
2009-11: రెడ్డీస్ ఫౌండేషన్‌లో ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా విధులు
2013 ఏప్రిల్‌లో పీహెచ్‌డీ ప్రదానం.
2013 మేలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో లే సెక్రటరీగా నియామకం.

Published date : 09 May 2013 02:50PM