Skip to main content

ముగ్గురు ఐఏఎస్ తల్లి.. చదివింది ఎనిమిదే..కానీ..!

మాయాదేవి.. ఆమె చదివింది కేవలం 8వ తరగతి వరకు మాత్రమే. కానీ తండ్రిలేని ముగ్గురు బిడ్డలను ఉన్నతాధికారులుగా తీర్చిదిద్దింది. బిడ్డల తండ్రి ఓ సామాన్య రైతు. ఆయన కూడా పిల్లలు చిన్నవాళ్లుగా ఉండగానే మరణించాడు.
అయినా.. ఆ తల్లికి మాత్రం తన బిడ్డలను ఐఏఎస్ అధికారులుగా చూడాలన్న తపన ఏమాత్రం తగ్గలేదు. ఉన్న ముగ్గురు బిడ్డల్లో ఎవరో ఒకరిద్దరిని కాదు.. మొత్తం ముగ్గురినీ ఆ స్థాయిలోనే చూడాలని గట్టిగా పట్టుబట్టింది. ఎంతగా అంటే, పెద్ద కూతురు ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతుండగానే ఆమె ఆ నిర్ణయం తీసుకుంది. ఎక్కడో రాజస్థాన్‌లోని మారుమూల గ్రామంలో నివాసం ఉండే మాయాదేవి.. జీవితంలో తాను ఎంత కష్టాలు పడినా.. తన బిడ్డలను మాత్రం ఉన్నత విద్య కోసం ఢిల్లీకి పంపింది.

టెన్త్‌ రెండు సార్లు, ఇంటర్‌ మూడు సార్లు ఫెయిల్‌.. అయినా ప్రభుత్వ టీచ‌ర్ ఉద్యోగం కొట్టానిలా

ఇప్పుడు ఆమె..
ఇప్పుడు ఆమె ప్రపంచంలోనే తనంత అదృష్టవంతురాలు, సంతోషకరమైన తల్లి మరొకరు లేరని భావిస్తోంది. ఆమె పెద్దకుమార్తె క్రాంతి ఇప్పటికే యూపీఎస్సీ పరీక్షలు పాసై.. ముంబైలో ఆదాయపన్ను శాఖ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పుడు కుమారుడు లోక్బంధు, రెండో కుమార్తె పూజ కూడా యూపీఎస్సీ విడుదల చేసిన పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణులయ్యారు. దీంతో తాను కన్న కలలు నిజమయ్యాయని, బిడ్డలు ముగ్గురూ ఉన్నత స్థానాల్లో నిలవడం ఆనందంగా ఉందని ఆమె చెబుతోంది.

మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్‌...అయినా మోడ‌ల్‌ 'ప్రిన్సిపాల్' అయ్యానిలా..
Published date : 05 Jun 2021 07:37PM

Photo Stories