ఈ సివిల్స్ టాపర్ తొలిజీతం ఎవరికి ఇచ్చారో తెలుసా...?
Sakshi Education
సివిల్స్ ఆలిండియా టాపర్ గా నిలిచి దేశవ్యాప్తంగా సుపరిచితురాలైన కేఆర్ నందిని తన తొలి వేతనాన్ని ఉచిత విద్యకు విరాళంగా ఇచ్చారు.. ఐఏఎస్ టాపర్ గా నిలిచిన వెంటనే నందిని, విద్యకే తొలి ప్రాధాన్యమివ్వనున్నట్టు చెప్పిన సంగతి తెలిసిందే. ఆమె తొలి వేతనాన్ని ఆల్వా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఉచిత విద్యా పథకానికి ఇచ్చారు.
కన్నడ సాహిత్యాన్ని ఐఏఎస్ పరీక్షల్లో..
ఆల్వా ఉచిత ఎడ్యుకేషన్ స్కీమ్ కింద లబ్దిపొందిన విద్యార్థుల్లో నందిని కూడా ఒకరు కావడం విశేషం. కన్నడ సాహిత్యంతో తనకున్న సంబంధం, తన లక్ష్యాలను సాధించడానికి చాలా సహకరించాయని నందిని పేర్కొన్నారు. సివిల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేసిన నందిని, తన నేపథ్యానికి భిన్నంగా కన్నడ సాహిత్యాన్ని ఐఏఎస్ పరీక్షల్లో ఆప్షనల్ గా ఎంచుకున్నారు.
కేవలం పొట్టకూటి కోసమే ఈ ఉద్యోగంలో చేరా...
కుటుంబ నేపథ్యం:
నందిని తండ్రి కేవీ రమేశ్, తల్లి విమలమ్మ. ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నదే లక్ష్యంగా నాలుగో ప్రయత్నంలో ఆమె ఈ ఘనతను సాధించారు. కర్ణాటక కోలార్ జిల్లాలోని కెంబోడి ప్రాంతానికి చెందిన వారు కేఆర్ నందిని.
చదువు బీటెక్-రాబడి హైటెక్
అమ్మ, నాన్న చెప్పిన ఆ మాటలే... నన్ను 'ఐఏఎస్' అయ్యేలా చేశాయ్...
Published date : 19 Aug 2021 03:35PM