Skip to main content

Women IPS Officer Success Story : నా జీవితంలో అన్ని ఎదురు దెబ్బలే.. ఈ బ‌ల‌మైన కోరిక‌తోనే 'ఐపీఎస్' ఆఫీస‌ర్ అయ్యానిలా.. కానీ..

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (UPSC) నిర్వ‌హించే సివిల్స్ లాంటి ప‌రీక్ష‌ల్లో విజ‌యం సాధించాలంటే.. అసాధారణమైన సంకల్పం, పట్టుదల ఉంటే కానీ ఇందులో విజ‌యం సాధించ‌లేరు. స‌రిగ్గా ఇదే బ‌ల‌మైన సంకల్పంతో ముందడు వేసి విజ‌యం సాధించారు.. ఢిల్లీకి చెందిన అన్షికా జైన్.
IPS Anshika Jain Success Story

క‌ఠిన సంకల్ప శక్తి, పట్టుదల ఉంటే ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కోవచ్చు నిరూపించారు ఈమె. బాధల నుంచే  సంతోషాన్ని, సక్సెస్‌ను అందుకోవచ్చు అన్నారు . ఐపీఎస్ ఆఫీసర్ అన్షికా జైన్ సక్సెస్‌ స్టోరీ చదివితే దీన్ని అక్షరాలా నిజం అంటారు. 

☛ Andra Vamsi IAS Success Story : ఏసీ గదుల్లో కూర్చొని ప‌నిచేసే క‌లెక్ట‌ర్ కాదు ఈయ‌న‌.. ప్రతి ఫిర్యాదుకు.. ఒక డెడ్‌లైన్‌.. ప్ర‌జ‌ల్లోనే ఉంటూ..

కుటుంబ నేప‌థ్యం :
ఢిల్లీకి చెందిన అన్షికా అయిదేళ్ల ప్రాయంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. దీంతో అమ్మమ్మ , మేనమామల వద్దే పెరిగింది. వారే ఆమె జీవితంలో ప్రధానంగా మారిపోయారు. ఆమె జీవితంలో బలమైన స్తంభాలుగా  నిలిచారు.  ఆమె ఉన్నతికి  బాటలు వేశారు. 

ఇందుకే సివిల్స్‌ వైపు వ‌చ్చా..

upsc civils success stories in telugu

ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న అన్షిక అమ్మమ్మ తాను సివిల్ సర్వెంట్ కావాలని కలగంది. కానీ అది సాకారం లేదు. అందుకే మనవరాలిని ఆ వైపు ప్రోత్సహించింది.  అన్షిక కూడా అమ్మమ్మ డ్రీమ్‌ను నెరవేర్చాలని నిర్ణయించుకుంది.

➤☛ Sadaf Choudhary IAS Success Story : ఆ కట్టుబాట్లను చెరిపేసి.. అనుకున్న‌ట్టే క‌లెక్ట‌ర్ ఉద్యోగం సాధించానిలా.. చివ‌రికి..

ఇక్కడే మరోసారి పెద్ద ఎదురుదెబ్బ తగిలిందిలా..

IPS Anshika Jain UPSC Story in Telugu

ఢిల్లీ యూనివర్సిటీలోని రాంజాస్ కాలేజీలో ఎంకామ్‌ పూర్తి చేసిన తర్వాత, దేశంలోని అతిపెద్ద  కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది అన్షికకు. కానీ ఐపీఎస్‌ కావాలనేది  కోరికతో దానిని తిరస్కరించింది. యూపీఎస్‌సీ కోసం సిద్ధమవుతోంది. ఇక్కడే మరోసారి ఆమెకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. 2019లో తనకు పెద్ద దిక్కుగా ఉన్న అమ్మమ్మను కోల్పోయింది. ఏకైక సపోర్ట్ సిస్టమ్‌ మాయం కావడంతో చాలా బాధపడింది అన్షిక. కానీ అమ్మమ్మ డ్రీమ్‌ గుర్తు చేసుకుంది. పట్టుదలతో  ప్రిపరేషన్‌ను కొనసాగించింది. నాలుగు సార్లు విజయం దక్కకపోయినా పట్టు వీడలేదు.

☛ Bollywood Actress IPS officer Simala Prasad Success Stroy : ఈ ప్ర‌ముఖ నటి.. ఎలాంటి కోచింగ్‌ లేకుండా.. తొలి ప్రయత్నంలోనే ఐపీఎస్ కొట్టిందిలా.. కానీ..

జస్ట్ మిస్‌.. ఒక్క మార్కుతో..

IPS Anshika Jain Real Life Story in Telugu

2020లో జస్ట్‌ ఒక్క నంబరులో అవకాశాన్ని కోల్పోయింది. చివరికి అయిదో ప్రయత్నంలో AIR-306 ర్యాంకు  సాధించింది. అలా ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్‌ కావాలనే ఆమె కోరిక ఫలించింది. 2023, జూన్‌ 5  ఏఐఎస్‌ అధికారి వాసు జైన్‌ను ప్రేమ వివాహం చేసుకుంది.  అన్షిక  ఐపీఎస్‌  కల సాకారంలో వాసు జైన్‌  పాత్ర కూడా చాలా ఉందిట. నేటి యువ‌త‌కు అన్షిక ఐపీఎస్‌ స‌క్సెస్ జ‌ర్నీ స్ఫూర్తిధాయ‌కం.

☛ IAS Success Story : మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ 2వ‌ ర్యాంక్ కొట్టా.. క‌లెక్ట‌ర్ అయ్యా.. కానీ నా భ‌ర్త..

Published date : 01 Apr 2024 04:58PM

Photo Stories