చదువుపై విరక్తిపుట్టేలా చదవొద్దు...సివిల్స్ విజేత, జాతీయస్థాయి 9 వర్యాంకు సాధించిన డి.కృష్ణబాస్కర్
Sakshi Education
సివిల్స్‌కు ప్రిపేరయ్యే అభ్యర్థులు రోజంతా చదివితే విజయ సాధిస్తారనుకోవడం పొరపాటు. చదివినంతసేపు ఇష్టపడి చదివితే ఫలితం ఉంటుంది. అంతేగాని చదువుపై విరక్తి పుట్టేలా చదివితే ఫలితం ఉండదు. ఒకపక్క ఎనలిటికల్‌గా చదువుతూనే మరోపక్క మన హాబీలను ఎంజాయ్ చేస్తూ ప్రిపరేషన్ ప్లానింగ్ ఉంటే విజయం సులువే. చాలామంది అభ్యర్థులు విజయం సాధించడంకోసం గత విజేతలను గుడ్డిగా అనుసరిస్తారు. ఇది మంచిదికాదు. ఎవరి అవకాశాలు, అనుకూలాంశాలు వారివి. అందుకే సొంత ముద్రవేసుకునేలా చదవాలి. అంతేకాదు సివిల్స్ విజయం సాధించాలంటే పత్రికలను తరచుగా చదవాలంటున్నారు ఇద్దరు సీనియర్ ఐఏఎస్‌ల ముద్దుబిడ్డ డి.కృష్ణబాస్కర్. తొలిప్రయత్నంలో 90వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. మళ్లీ ప్రయత్నంలో 9వర్యాంకుతో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ఆయనతో సాక్షి ఇంటర్వ్యూ...
- ఐఏఎస్‌లో టాపర్‌గా నిలిచినందుకు ఎలా ఫీలవుతున్నారు?
చాలా సంతోషంగా ఉంది. జాతీయస్థాయిలో 9వ ర్యాంకు వస్తుందని అస్సలు ఊహించలేదు. సివిల్స్ ఇంటర్వ్యూ ఎంత బాగా అటెంప్ట్‌చేసినా ఫలితాలు వచ్చేవరకు పెద్దగా ఆశలు పెట్టుకోకూడదు. అయితే ఫలితాలు వెలువడేసరికి 9వ ర్యాంకులో నిలిచానని తెలియడంతో నా సంతోషానికి అవధులులేవు. ఇంట్లో కుటుంబసభ్యులు ఐఏఎస్ అధికారులైనప్పటికీ నా సక్సెస్‌తో వాళ్లు కూడా చాలా ఆనందపడ్డారు.
- మీ విద్యాభ్యాసం? కుటుంబ నేపథ్యం?
నాన్న, అమ్మ ఇద్దరూ ఐఏఎస్‌లే. తల్లి లక్ష్మీపార్థసారధి సీనియర్ ఐఏఎస్. తండ్రి బాస్కర్ ఆర్థికశాఖలో ముఖ్యకార్యదర్శి. ప్రాథమిక విద్య అంతా హైదరాబాద్‌లోని ఢిల్లీపబ్లిక్‌స్కూల్లో జరిగింది. ఆతర్వాత ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ చేశాను. ఆతర్వాత హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబీఏ చేశాను.
- ఐఏఎస్ రాయాలని ఎప్పుడు నిర్ణయించుకున్నారు?ఈ వృత్తిపై ఆసక్తి కలగడానికి కారణం? ప్రేరణ?
ఫస్ట్‌టైం సివిల్స్ రాసి 90వ ర్యాంకు సాధించాను. కాని మూడు మార్కుల్లో ఐఏఎస్ కోల్పోయాను. కేవలం ఐపీఎస్‌తో సరిపెట్టుకున్నా. దేశంలో ఎక్కువ మందికి సేవచేసే అవకాశం సివిల్స్‌ద్వారానే వస్తుంది. అందుకే ఎంబీఏ పూర్తయ్యాక సివిల్స్ రాయాలనుకున్నా. కనీసం విధుల్లో చేరాక ఎక్కువకాలం ప్రజలమధ్యనే ఉండి వారికి సేవ చేయాలనేది నా ఆలోచన.
- సివిల్స్‌లో ఆప్షనల్స్ ఎలా ఎంచుకున్నారు?మెటీరియల్ ఎలా సమకూర్చుకున్నారు? ఏయే బుక్స్ ఫాలో అయ్యారు?
పబ్లిక్‌అడ్మినిస్ట్రేషన్, ఆంత్రోపాలజీ నా సబ్జెక్టు ఆప్షన్లు. మిగిలినవాటితో పోల్చితే వీటికి కొంచెం పరిధి తక్కువ. అదేవిధంగా ఈ సబ్జెక్టులకు మంచి బుక్స్,మెటీరియల్ లభ్యమవుతాయి. పైగా ఈ సబ్జెక్టులు స్వతహాగా ఇష్టంకూడా. సివిల్స్‌లో ప్రతిస్టేజ్‌కి పత్రికలు బాగా చదివేవాడిని. ఒకరకంగా సివిల్స్‌లో విజయం సాధించడమా?లేదా? అనేది ఒకరకంగా మనం పత్రికలు చదవి అర్థం చేసుకునే విధానంపై ఆధారపడి ఉంటుందనేది నా అభిప్రాయం.
- కోచింగ్ తీసుకున్నారా? ఎలాంటి ప్రిపరేషన్ వ్యూహాన్ని అనుసరించారు?
రోజకు 5నుంచి 6 గంటల వరకు చదివేవాడిని. అయితే ఇన్నిగంటలు చదవాలనే నియమం ఏరోజూ పెట్టుకోలేదు. ఇష్టపడి చదివితే రెండు గంటలైనా సరిపోతుంది. చాలా మంది రోజుకు ఇన్నిగంటలు చదివితేనే విజయం సాధిస్తారని అనుకుంటారు. అది తప్పు. ఐఏఎస్‌కు ప్రిపేరయ్యేవారు ఎప్పుడూ చదువుతూ ఉంటే విజయం సాధిస్తాం అనుకోవడం పొరపాటు. ఎందుకంటే చదువుపై విరక్తిపుట్టేలా చదవకుండా ఉంటే చాలు. నావరకు నేను కోచింగ్ తీసుకున్నాను.
- ఐఏఎస్ పరీక్షలో ప్రిలిమ్స్, మెయిన్స్‌లో ప్రశ్నల సరళి ఎలా ఉంది?
ప్రిలిమ్స్ ప్యాట్రన్ మార్చడంతో కొంచెం కష్టంగానే ఉంది. అయితే ఇంగ్లీషు చదువు నేపథ్యం ఉన్న విద్యార్థులకు ఈ కొత్త విధానం పెద్ద కష్టంకాదు. అయితే ఇంతకుముందులా కేవలం స్టడీ మెటీరియల్ చదివితే ప్రిలిమ్స్ పాసయ్యే రోజులు పోయాయి.
ఇప్పుడు ఎక్కువ శాతం అభ్యర్థిలో ఐఏఎస్,ఐపీఎస్ కాగల లక్షణాలు ఉన్నాయా?లేవా? అని తెలుసుకునేవిధంగా సామర్థ్యాలు పరీక్షిస్తున్నారు. మెయిన్స్‌విషయంలో ప్రశ్నలు అంత కష్టంగా లేవనే చెబుతాను. ఎందుకంటే సబ్జెక్టులను అర్థం చేసి చదువుకుంటే సులువుగానే రాయవచ్చు. అయితే పత్రికలను కచ్చితంగా ఫాలో అయితే ఆప్షనల్ సబ్జెక్టుల్లో రాసే సమాధానాలకు తాజా పరిణామాలు జతచేసి రాసే అవకాశం ఉంటుంది.
- మీ ఇంటర్వ్యూ ఎలా జరిగింది? ఏయే అంశాలపై ప్రశ్నలు అడిగారు?
● దేశ ఆర్థిక వ్యవస్థపై అభిప్రాయం? ప్రస్తుత పరిస్థితిపై విశ్లేషణ చేయండి?
● ప్రపంచ ఆర్థికవ్యవస్థపై మీకున్న అంచనా వివరించండి?
● డబ్ల్యూటీవో గురించి చె ప్పండి?
● ద్రవ్యోల్బణం అంటే? దానిగురించి వివరించండి?
● ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎలా జరుగుతుంది?
● రాజ్యసభలో మొత్తం ఎంతమంది సభ్యులుంటారు? వంటి ప్రశ్నలు అడిగారు.
- ఐఏఎస్ రాయాలనుకుంటున్న అభ్యర్థులకు మీరిచ్చే సూచన?
ఒత్తిడికి గురవ్వొద్దు. చదివింది ఒకటికిరెండుసార్లు రివిజన్ చేసుకుంటే మంచిది.ప్రణాళికబద్ధంగా ప్రిపరేషన్ సాగిస్తేనే విజయం సాధ్యమే.
పరీక్షలుసమీపిస్తున్నా..లేకపోయినా పత్రికలను మాత్రం తరచుగా ఫాలో అవడం మాత్రం మానొద్దు. ఎందుకంటే సివిల్స్‌లో సగం విజయం పత్రికలు చదవడం ద్వారా దక్కించుకోవచ్చు. అయితే ఆప్షన్లు ఎంచుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరో చెప్పారని..గత విజేతలు తీసుకుని చదివిన ఆప్షనల్స్‌ను ఎంచుకోవడం వంటి చేయకూడదు. అభ్యర్థులు తమ శక్తిసామర్థ్యాలను అంచనావేసుకుని ముందడుగువేస్తే విజయం పెద్ద కష్టంకాదు.
Published date : 05 May 2012 08:33PM