Jagananna Civil Services Prothsahakam: దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే
Sakshi Education
పార్వతీపురం టౌన్: జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా సాంఘిక సంక్షేమ, సాధికారత అధికారి ఎం.డి.గయాజుద్దీన్ అక్టోబర్ 20న ఓ ప్రకటనలో తెలిపారు.
ప్రభుత్వ జీఓ 58 ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా బల హీనమైన, వెనుకబడిన వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వం ‘జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం’ అనే కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చిందన్నారు.
చదవండి: సివిల్స్ - స్టడీ మెటీరియల్ | సక్సెస్ స్టోరీస్ | ఎఫ్‌ఏక్యూస్ | గైడెన్స్ | వీడియో లెక్చర్స్ | జనరల్ ఎస్సే | జీకే
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి రూ.1,00,000, మెయిన్స్‌లో అర్హత సాధించిన వారికి రూ.50,000 నగదు ప్రోత్సాహకం అందిస్తుందని పేర్కొన్నారు. 2023లో నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అర్హులైన అభ్యర్థులు నగదు ప్రోత్సాహకం కోసం జ్ఞానభూమి.ఏపీ.జీఓవీ.ఇన్ పోర్టల్‌లో వచ్చేనెల 4వ తేదీలోగా దరఖాస్తు చేసుకో వాలన్నారు.
Published date : 21 Oct 2023 01:16PM