UPSC: సివిల్స్ ప్రిలిమ్స్ ‘కీ’ విడుదల, ఫలితాల వివరాలు
Sakshi Education
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) అక్టోబర్ 10న దేశవ్యాప్తంగా నిర్వహించిన సివిల్స్–2021 ప్రిలిమ్స్ çఫలితాలను అక్టోబర్ 29న విడుదల చేసింది.
మెయిన్స్ కు అర్హత సాధించిన వారి పేర్లను యూపీఎస్సీ వెబ్‌సైట్ (www.upsc.gov.in)లో అందుబాటులో ఉంచింది. మెయిన్స్ కు వెళ్లేందుకు సమగ్ర దరఖాస్తు పత్రం (డీఏఎఫ్–1) నింపాల్సి ఉంటుందని తెలిపింది. ఇందుకు సంబంధించిన తేదీలను, ముఖ్యమైన సూచనలను త్వరలో వెబ్‌సైట్ ద్వారా తెలియజేస్తామని యూపీఎస్సీ స్పష్టం చేసింది. అర్హత పొందిన వారి మార్కులు, కటాఫ్ మార్కులు, ప్రిలిమ్స్ ‘కీ’ని సివిల్ సర్వీస్ పరీక్ష ప్రక్రియ పూర్తయ్యాకే విడుదల చేయనున్నట్లు తెలిపింది. యూపీఎస్సీ ఫెసిలిటేషన్ కేంద్రం న్యూఢిల్లీ షాజహాన్ రోడ్డులోని యూపీఎస్సీ బిల్డింగ్‌లో ఉంటుందని.. ఏదైనా సమాచారం కోసం అక్కడ సంప్రదించాలని సూచించింది. లేదా 011–23385271 ఫోన్ నంబర్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొంది.
చదవండి:
Deepika Patil, IPS : నాన్నను చూసే లాఠీ పట్టా...తొలి ప్రయత్నంలోనే ఐపీఎస్ సాధించా..
Published date : 12 Nov 2021 11:47AM