Nikhil Sai: విమానం బొమ్మలతో ఆడి.. విమానం నడుపుతున్నాడు
![Nikhil Sai](/sites/default/files/images/2023/06/19/nikhilsai-1687174858.jpg)
ఈ సందర్భంగా ఆయన తల్లిదండ్రులు కృష్ణ, చంద్రకళ తమ ఆనందాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘‘నిఖిల్ సాయికి చిన్నప్పటి నుంచి విమానం బొమ్మలంటే ఇష్టం. ఏ జాతరకు వెళ్లినా అవే బొమ్మలు కొనేవాడు. వాటిని నడుపుతా అనేవాడు. ఇప్పుడు విమానాలు నడుపుతున్నాడు. రాష్ట్రపతి చేతుల మీదుగా ఫ్లయింగ్ ఆఫీసర్‌గా మా అబ్బాయి బ్యాడ్జి అందుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.
చదవండి: Captain Shiva Chouhan: సియాచిన్‌పై వీర వనిత.. తొలి మహిళా సైనికాధికారిగా రికార్డు
తను ఇంకొందరికి ప్రేరణ అవుతాడన్న ఆశ ఉంది..’’అని చెప్పారు. ఇక నిఖిల్ సాయి మాట్లాడుతూ.. ‘‘పైలట్ కావడం నా కల. మా నాన్న కోరుకొండ సైనిక్ స్కూల్‌లో చేర్పించి దానిని తీర్చుకునేందుకు మార్గం చూపారు. నా ఇష్టం తీరడం, దేశ సేవలోకి రావడం రెండింటితో ఎంతో సంతృప్తిగా ఉంది. హకీంపేట్‌లో నాకు ఫ్లయింగ్ ఆఫీసర్‌గా పోస్టింగ్ ఇచ్చారని’’ తెలిపారు.