Agnipath Recruitment : జూన్ 24 నుంచే నియామక ప్రక్రియ.. అతి త్వరలోనే..
ఇందుకోసం సన్నద్ధం కావాలని యువతకు పిలుపునిచ్చారు. ‘‘సైనిక దళాల్లో చేరి దేశ సేవ చేయాలని కోరుకునేవారికి కొత్త మోడల్ సువర్ణావకాశం. పైగా గరిష్ట వయోపరిమితిని ఈ ఏడాది 21 నుంచి 23 ఏళ్లకు పెంచడం వల్ల మరింత మంది సైన్యంలో చేరే వీలు కలిగింది’’ అంటూ ఆయన జూన్ 17వ తేదీన (శుక్రవారం) ట్వీట్ చేశారు. రెండేళ్లుగా సైన్యంలో నియామకాలు చేపట్టకపోవడం వల్ల చాలా మంది సైన్యంలో చేరలేకపోయారని, వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, ప్రధాని మోదీ సూచన మేరకు వయోపరిమితి పెంచామని చెప్పారు.
Agnipath Scheme Details: అసలు అగ్నిపథ్ అంటే ఏమిటి...? దీని లాభనష్టాలు ఏమిటి?
సర్వీసులో ఉండగానే..
దేశ రక్షణ సన్నద్ధతతో పాటు ఆర్థికాభివృద్ధికి అవసరమైన నిపుణులైన యువతను తయారు చేయడానికి అగ్నిపథ్ తోడ్పడుతుందని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ పేర్కొంది. ‘‘ఈ దిశగా సైనిక దళాల భాగస్వామ్యంతో స్కిల్ ఇండియా, స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ యువతకు శిక్షణ ఇస్తాయి. నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్‌తో సమానమైన సిలబస్‌ను బోధిస్తారు. దీంతో వారిలో నైపుణ్యాలు పెరుగుతాయి. సర్వీసులో ఉండగానే స్కిల్ ఇండియా సర్టిఫికెట్లు ఇస్తారు. తద్వారా వ్యాపార రంగంలో, ఉద్యోగాల్లో ఎన్నో అవకాశాలు దక్కుతాయి’’ అని చెప్పింది.
Defence Jobs: సంచలన నిర్ణయం.. సైన్యంలో చేరాలంటే ఇవి తప్పక తెలుసుకోండి..
వాయుసేనలో 24 నుంచే నియామక ప్రక్రియ..
అగ్నిపథ్ నియామకాలకు త్వరలో శ్రీకారం చుడతామని త్రివిధ దళాలు ప్రకటించాయి. 2023 జూన్ నాటికి తొలి బ్యాచ్‌లను ఆపరేషనల్, నాన్–ఆపరేషన్ విభాగాల్లో చేర్చుకొనే దిశగా సన్నద్ధమవుతున్నట్లు సీనియర్ మిలటరీ అధికారులు చెప్పారు. వైమానిక దళంలో అగ్నిపథ్ నియామక ప్రక్రియ జూన్ 24వ తేదీ నుంచే మొదలవుతుందని వాయుసేన చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి చెప్పారు. ఆర్మీలోనూ అతి త్వరలో నియామక షెడ్యూల్ ప్రకటిస్తామని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచే శిక్షణ ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఉన్నత సైనికాధికారులు తెలిపారు. నేవీలోనూ అగ్నిపథ్ నియామక ప్రక్రియ అతి త్వరలోనే మొదలవనుంది.
Army Recruitment: ఏఏ దేశాల్లో సైనిక నియామకాలు ఎలా ఉన్నాయంటే..?