Agnipath Scheme Details: అసలు అగ్నిపథ్ అంటే ఏమిటి...? దీని లాభనష్టాలు ఏమిటి?
ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా యువత చేపట్టిన నిరసనలు, ఆందోళనలు తారస్థాయికి చేరాయి. రైల్వేస్టేషన్లను ముట్టడించడంతో పాటు హైవేలను దిగ్బంధించారు. అలాగే చాలాచోట్ల హింసాకాండ కూడా చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అసలు అగ్నిపథ్ అంటే ఏమిటి..? దీని లక్ష్యం ఏమిటి? అర్హతలు ఏమిటి? జీతం ఎంత ఉంటుంది? దీని వల్ల నష్ట/లాబాలు ఏమిటి? అసలు గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? మొదలైన అంశాలపై సమగ్ర సమాచారం మీకోసం..
ఈ ఉద్దేశ్యంతోనే..
దీనిని త్రివిధ దళాల్లో రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో మార్పుల కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకువచ్చింది. దేశంలో అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్‌ను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవలే ప్రకటించిన విషయం తెల్సిందే. 2023 జూలై నాటికి అగ్నిపథ్ స్కీమ్ కింద దేశంలోని 45వేల మంది యువతను రక్షణ దళంలోకి తీసుకునే అవకాశాన్ని కల్పించనున్నట్టు తెలిపారు. 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వయసులోపు వారే దీంట్లో ఉంటారు. ఆర్మీలో యువతను నింపాలన్న ఉద్దేశంతో ఈ స్కీమ్‌ను ప్రవేశపెట్టారు. కొత్త టెక్నాలజీతో యువతకు శిక్షణ ఇచ్చి.. వారి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కూడా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ స్కీమ్‌లో భాగంగా.. నాలుగేళ్ల పాటు యువతను భారత త్రివిధ దళాల్లో జాయిన్ చేసుకోవడమే ప్రధాన ఉద్దేశం. ఈ పథకం కింద ఉద్యోగంలో చేరిన వారిని ‘అగ్నివీర్’ అని పిలుస్తారు.
శిక్షణ ఇలా..:
ఎంపికైన వారికి 10 వారాల నుంచి 6 నెలల వరకు శిక్షణ ఉంటుంది. నాలుగేళ్ల తర్వాత కేవలం 25 శాతం మంది సైనికుల్ని మాత్రమే ఆర్మీలోకి రెగ్యులర్ క్యాడర్‌గా తీసుకుంటారు. వాళ్లు మాత్రమే 15 ఏళ్లపాటు సర్వీస్‌లో ఉంటారు. మిగతా వాళ్లకు 12 లక్షలు ఇచ్చి ఇంటికి పంపిస్తారు. వాళ్లకు పెన్షన్ బెనిఫిట్ ఉండదు.
నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్..
అగ్నిపథ్ పథకంలో భాగంగా సైన్యంలో పనిచేసి రిటైర్ అయిన అగ్నివీరులకు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, అస్సాం రైఫిల్స్ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్ ఉంటుంది. అలాగే ఈ రెండు బలగాల్లో చేరడానికి కావాల్సిన గరిష్ఠ వయోపరిమితిలోనూ అగ్నివీరులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది. తొలిబ్యాచ్ అగ్నివీరులకు వయోపరిమితిలో మొత్తంగా ఐదేళ్ల సడలింపు లభించనున్నట్లు స్పష్టం చేసింది.
కేంద్ర సాయుధ పోలీసు బలగాలు..
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సశస్త్ర సీమ బల్ (SSB), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG), స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG). ఈ బలగాలన్నీ కేంద్రహోంశాఖ పరిధిలోకి వస్తాయి. ఇక ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలు.. కేంద్ర రక్షణ శాఖ కింద ఉంటాయి.
లాభాలు ఇలా..
ఉద్యోగం కొనసాగిస్తున్న సమయంలో అగ్ని వీర్లకు 30వేల నుంచి 40వేల రూపాయల జీతం లభిస్తుంది.
Year |
Customised Package (Monthly) |
In Hand (70%) |
Contribution to Agniveer Corpus Fund (30%) |
Contribution to corpus fund by GoI |
All figures in Rs (Monthly Contribution) |
||||
1st Year |
30000 |
21000 |
9000 |
9000 |
2nd Year |
33000 |
23100 |
9900 |
9900 |
3rd Year |
36500 |
25580 |
10950 |
10950 |
4th Year |
40000 |
28000 |
12000 |
12000 |
Total Contribution in Agniveer Corpus Fund after four years |
Rs 5.02 Lakh |
Rs 5.02 Lakh |
దీని వల్ల నష్టాలు..
త్రివిధ దళాల్లో రిక్రూట్‌మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ‘అగ్నిపథ్’ పథకం(Agnipath Scheme) దేశ వ్యాప్తంగా అగ్గి పుట్టించింది. ఆర్మీలో చేరేందుకు సిద్ధమవుతున్నవారు, పాత రిక్రూట్‌మెంట్లలో వివిధ దశలు పూర్తి చేసుకున్న అభ్యర్థులు తీవ్ర నిరసనలు తెలిపారు. అలాగే ఈ క్రమంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విధ్వంసం చెలరేగింది. ముఖ్యంగా మిలటరీ ఉద్యోగాల కోసం రెండేళ్లుగా రేయింబవళ్లు కష్టపడుతున్న వారికి నాలుగేళ్ల సర్వీసుతోనే రిటైరవ్వాలన్న నిబంధన మింగుడు పడలేదు. ఉద్యోగం లేక, పెన్షనూ రాక రోడ్డున పడతామన్న భయాందోళనలు నెలకొన్నాయి. ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు గరిష్ట వయోపరిమితి 23 ఏళ్లు కాగా.. అగ్నిపథ్‌కు 21 ఏళ్లు మాత్రమే. ఓవైపు రిక్రూట్‌మెంట్ ప్రక్రియను ఆపేయడం, మరోవైపు వయోపరిమితి తగ్గి అర్హత కోల్పోవడంతో అభ్యర్థులు ఆందోళనకు దిగుతున్నారు. దీనిపై కేంద్రం ఏం చెప్పినా నిరాశలో ఉన్న యువత వినే పరిస్థితి లేదు.