RSSB Exam Applications : ఆర్ఎస్ఎస్‌బీ పరీక్షకు దరఖాస్తులు ప్రారంభం.. ఆగస్ట్‌లో పరీక్ష.. ముఖ్యవివరాలివే..

సాక్షి ఎడ్యుకేషన్: ఆర్ఎస్ఎస్‌బీ.. రాజస్థాన్ స్టాఫ్ సెలక్షన్ బోర్డు పంచాయతీ రాజ్ శాఖ పరిధిలోని గ్రామ అభివృద్ధి అధికారుల (VDO) నియామకానికి దరఖాస్తులు ప్రారంభమైయ్యాయి. ఇందులో, మొత్తం 850 ఖాళీలకు నోటిఫికేషన్‌ను విడుదల చేయగా.. 683 పోస్టులు నాన్-షెడ్యూల్డ్ ప్రాంతాలకు, 167 పోస్టులు షెడ్యూల్డ్ ప్రాంతాలకు కేటాయించారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే అధికారిక వెబ్‌సైట్ rssb.rajasthan.gov.in ను సందర్శించి, దరఖాస్తులు పూర్తి చేయాలని అధికారుల ఆదేశం.
దరఖాస్తులు.. రుసుము..
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ నుంచి దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే, వన్-టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) రుసుము చెల్లించని వారు e-Mitra కియోస్క్‌లు, కామన్ సర్వీస్ సెంటర్లు (CSCలు), నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్/క్రెడిట్ కార్డుల ను ఉపయోగించవచ్చు. రాజస్థాన్‌లోని జనరల్, ఓబీసీ (క్రీమీ లేయర్) వర్గాలకు చెందిన అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 600, నాన్-క్రీమీ లేయర్ ఓబీసీ, ఎంబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 400 చెల్లించాల్సి ఉంటుంది. అదే తగ్గించిన రుసుము వికలాంగులకు వర్తిస్తుంది.
దరఖాస్తులకు విధానం:
1. ముందుగా, అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: rsmssb.rajasthan.gov.in
2. "రిక్రూట్‌మెంట్ ప్రకటన" విభాగంపై క్లిక్ చేసి, వీడీఓ (VDO) రిక్రూట్‌మెంట్‌ను సందర్శించి, రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి. ముందే చేసుంటే డైరెక్ట్ లాగిన్ అవ్వండి.
3. మీ SSO ID & పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి.
4. ఇక్కడ, మీ వ్యక్తిగత, విద్యా & సంప్రదింపు సమాచారంతో సహా ఖచ్చితమైన వివరాలతో ఫార్మ్‌ను పూరించి, అవసరమైన పత్రాలను నమోదు చేయండి. దీనితోపాటు, ఫీజును కూడా సమర్పించండి.
5. మరోసారి పూర్తిగా పరిశీలించి, సబ్మిట్ చేయండి. ఆ ఫార్మ్‌ను ప్రింట్ తీసుకోండి. భవిష్యత్తులో అవసరం ఉంటుంది.
పరీక్ష తేదీ, విధానం:
ఈ పరీక్షను ఆగస్టు 31, 2025న ఆఫ్‌లైన్‌లో (OMR-ఆధారిత) నిర్వహించనున్నారు. అవసరమైతే పరీక్ష తేదీ లేదా వేదికను మార్చే హక్కు బోర్డుకు ఉంది. పరీక్ష బహుళ దశల్లో నిర్వహిస్తే, స్కోర్‌ల సాధారణీకరణ వర్తిస్తుంది. ప్రిలిమినరీ పరీక్షలో మొత్తం 200 మార్కులతో 160 ప్రశ్నలు ఉంటాయి, మూడు గంటల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రశ్నపత్రంలో జనరల్ హిందీ అండ్ ఇంగ్లీష్, గణితం, జనరల్ నాలెడ్జ్, భౌగోళిక శాస్త్రం & సహజ వనరులు, రాజస్థాన్ సందర్భంలో వ్యవసాయం & ఆర్థిక వనరులు & రాజస్థాన్ చరిత్ర & సంస్కృతిపై విభాగాలు ఉంటాయి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Jobs 2025
- RSSB Exam Applications
- Rajasthan Staff Selection Board Exam Applications
- Offline exam for RSSB
- august 31st
- Panchayati Raj Department
- Village Development Officers
- RSSB for VDO Posts
- RSSB Exam
- Rajasthan Govt Exams and Jobs Notification 2025
- RSSB Notification 2025
- Govt exam for VDO Jobs
- Exam method for RSSB
- Applications Details and Eligibilities for RSSB VDO 2025
- Competitive exams in rajasthan
- Education News
- Sakshi Education News
- 850 VDOVacancies
- RajasthanGovernmentJobs
- RajasthanVDOJobs