Skip to main content

Defence Jobs: సంచలన నిర్ణయం.. సైన్యంలో చేరాలంటే ఇవి తప్పక తెలుసుకోండి..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: భారత రక్షణ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. త్రివిధ దళాల్లో రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియలో మార్పుల కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకువచ్చింది.
rajnath singh
ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

దేశంలో అగ్నిప‌థ్ రిక్రూట్మెంట్ స్కీమ్‌ను ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్ర‌క‌టించారు. ఈ మేరకు కేబినెట్‌ కమిటీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ మేర‌కు జూన్ 14వ తేదీన (మంగ‌ళ‌వారం) త్రివిధ దళాల అధిపతుల‌తో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.

కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగాల కోసం క్లిక్ చేయండి

45వేల మంది యువతను..
ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 2023 జూలై నాటికి అగ్నిప‌థ్ స్కీమ్ కింద దేశంలోని 45వేల మంది యువతను ర‌క్ష‌ణ ద‌ళంలోకి తీసుకునే అవ‌కాశాన్ని క‌ల్పించ‌నున్నట్టు తెలిపారు. 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వ‌య‌సులోపు వారే దీంట్లో ఉంటారు. ఆర్మీలో యువ‌త‌ను నింపాల‌న్న ఉద్దేశంతో ఈ స్కీమ్‌ను ప్ర‌వేశ‌పెట్టినట్టు వెల్లడించారు. కొత్త టెక్నాల‌జీతో యువ‌త‌కు శిక్ష‌ణ ఇచ్చి.. వారి ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచేందుకు కూడా శిక్ష‌ణ ఇవ్వనున్నట్టు చెప్పారు.

ఆర్ఆర్‌బీ ఉద్యోగాల కోసం క్లిక్ చేయండి

రూ.30వేల నుంచి 40వేల రూపాయల జీతంతో పాటు..
అగ్నిప‌థ్ స్కీమ్‌లో భాగంగా.. నాలుగేళ్ల పాటు యువ‌త‌ను భార‌త త్రివిధ ద‌ళాల్లో జాయిన్ చేసుకోవ‌డ‌మే ప్ర‌ధాన ఉద్దేశం. ఈ ప‌థ‌కం కింద ఉద్యోగంలో చేరిన వారిని ‘అగ్నివీర్’ అని పిలుస్తారు. ఉద్యోగం కొన‌సాగిస్తున్న స‌మ‌యంలో అగ్ని వీర్లకు 30వేల నుంచి 40వేల రూపాయల జీతం లభిస్తుంది. ఎంపికైన వారికి 10 వారాల నుంచి 6 నెలల వరకు శిక్ష‌ణ ఉంటుంది. నాలుగేళ్ల త‌ర్వాత కేవ‌లం 25 శాతం మంది సైనికుల్ని మాత్ర‌మే ఆర్మీలోకి రెగ్యుల‌ర్ క్యాడ‌ర్‌గా తీసుకుంటారు. వాళ్లు మాత్ర‌మే 15 ఏళ్లపాటు స‌ర్వీస్‌లో ఉంటారు. మిగతా వాళ్ల‌కు 12 ల‌క్ష‌లు ఇచ్చి ఇంటికి పంపిస్తారు. వాళ్ల‌కు పెన్ష‌న్ బెనిఫిట్ ఉండ‌దు.

ఎస్ఎస్‌సీ ఉద్యోగాల కోసం క్లిక్ చేయండి

బ్యాంక్ ఉద్యోగాల కోసం క్లిక్ చేయండి

Published date : 14 Jun 2022 06:48PM

Photo Stories