సైన్యంలో ‘Agneepath’ నోటిఫికేషన్.. ఇవీ అర్హతలు..
దరఖాస్తుదారుల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది. www.joinindianarmy.nic.in వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ కింద చేరే అగ్నివీరులను ప్రత్యేకమైన ర్యాంకుగా పరిగణిస్తారు. అవి ప్రస్తుత ర్యాంకులకు భిన్నంగా ఉంటాయి. అధికార రహస్యాల చట్టం–1923 ప్రకారం.. అగ్నివీరులు నాలుగేళ్ల సర్వీసులో తెలుసుకొన్న సమాచారాన్ని ఇతర అనధికారిక వ్యక్తులకు చేరవేయడం నేరమని స్పష్టం చేసింది. వైద్య పరీక్షలు, ఫిజికల్/రాత/ఫీల్డ్ పరీక్షల ద్వారా అగ్నివీరులను ఎంపిక చేయనున్నట్లు తెలియజేసింది.
చదవండి:
Agnipath Scheme Details: అసలు అగ్నిపథ్ అంటే ఏమిటి...? దీని లాభనష్టాలు ఏమిటి?
Agnipath: 10% reservation for Agniveers in CAPFs and Assam Rifles
- ప్రస్తుతం సైన్యంలో పనిచేస్తున్న వారి సంతానానికి, మాజీ సైనికుల సంతానానికి, వార్ విడో సంతానానికి, ఎక్స్–సర్వీస్‌మెన్ విడో సంతానానికి అగ్నిపథ్ కింద ఉమ్మడి ప్రవేశ పరీక్షలో 20 బోనస్ మార్కులు ఇస్తారు.
- NCC సర్టిఫికెట్లుంటే బోనస్ మార్కులు ఇస్తారు.
- నాలుగేళ్ల తర్వాత తమను సైన్యంలోనే కొనసాగించాలని వాదించే హక్కు అగ్నివీరులకు లేదు.
- Agneepath కింద నియామక ప్రక్రియలో భాగంగా అన్ని రకాల నియమ నిబంధనలకు అగ్నివీరులు అంగీకరించాల్సి ఉంటుంది.
- 18 ఏళ్ల లోపు వారు అభ్యర్థులకు తల్లిదండ్రులు లేదా సంరక్షకులు సంతకం చేయాలి.
- అగ్నివీరులకు ఏటా 30 సెలవులుంటాయి. మెడికల్ లీవ్ కూడా ఇస్తారు.
- సర్వీసు ముగిశాక రెగ్యులర్ కేడర్‌లో చేరడానికి అగ్నివీరులు దరఖాస్తు చేసుకోవచ్చు. సర్వీసులో కనబర్చిన ప్రతిభ ఆధారంగా 25 శాతం మందిని రెగ్యులర్ సర్వీసులో చేర్చుకుంటారు.
ఇవీ అర్హతలు
జనరల్ డ్యూటీ
- పదో తరగతిలో కనీసం 45 శాతం మార్కులుండాలి. ప్రతి సబ్జెక్టులో కనీసం 33 శాతం మార్కులు తప్పనిసరి.
టెక్నికల్ క్యాడర్
- ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో 12వ తరగతిలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ప్రతి సజ్జెక్టులో 40% మార్కులు ఉండాలి.
క్లర్క్/స్టోర్ కీపర్(టెక్నికల్)
- ఏ విభాగంలోనైనా కనీసం 60 శాతం మార్కులతో 12వ తరగతి పాసవాలి. ప్రతి సబ్జెక్టులో 50 శాతం మార్కులు ఉండాలి. ఇంగ్లిష్, మ్యాథ్స్/అకౌంట్స్/బుక్ కీపింగ్‌లో కనీసం 50 శాతం మార్కులు ఉండడం తప్పనిసరి.
ట్రేడ్స్‌మెన్ కేటగిరీ
- రెండు కేటగిరీలు ఉండగా, మొదటి కేటగిరీకి 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి. ప్రతి సబ్జెక్టులో 33 శాతం మార్కులు ఉండాలి.